Stock Market Today: లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
Stock Market Today: నష్టాలతో ప్రారంభమైనప్పటికీ...ప్రస్తుతం లాభాల బాటలో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. నష్టాలతో ప్రారంభమైనప్పటికీ వెంటనే పుంజుకొన్న సూచీలు లాభాలతో నడుస్తున్నాయి. ఉదయం 9.29 సమయంలో సెన్సెక్స్ 95 పాయింట్ల లాభంతో 48,639, నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో 14,554 వద్ద ట్రేడవుతున్నాయి. బన్నారీ అమన్ షుగర్స్, సువేన్ లైఫ్, టిన్‌ప్లాటె, ఆదిత్యబిర్లా, అదానీ ట్రాన్స్‌మిషన్ లాభాల్లో ఉండగా.. ఇండియన్ ఓవర్సీస్, వీఐపీ ఇండస్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇన్ఫోసిస్, గుజరాత్ అల్కలి షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
లోహరంగ సూచీ అత్యధిక లాభాల్లో ఉండగా.. ఐటీ సూచీ అత్యధిక నష్టాల్లో ఉంది. ప్రపంచ పరిణామాలు, భారీ నష్టాల తర్వాత ఒక రోజు మార్కెట్లకు సెలవు రావడంతో కోలుకోవడానికి సహకరించాయి. నేడు విప్రో, బ్లూబ్లెండ్స్, హాత్‌వే భవానీ కేబుల్స్ అండ్ డేటాకామ్, టిన్‌ప్లేట్ కంపెనీ వంటివి నేడు ఫలితాలను ప్రకటించనున్నాయి. ఏసీఎక్స్ పదిగ్రాముల బంగారం ధర రూ.354 తగ్గి రూ.46,621 వద్ద, వెండి కిలోకు రూ.95 తగ్గి 67,561 వద్ద ట్రేడవుతున్నాయి. రూపాయితో డాలర్ మారకం విలువ 0.32పైసలు పతనమై రూ.74.90 వద్ద ట్రేడవుతోంది.