Stock Market: నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
Stock Market: నష్టాల్లో అల్ట్రా టెక్, ఎల్ అండ్ టీ, రెడ్డీస్ ల్యాబ్
Stock Market: మదుపరుల ఆశలకు గండి పడింది. భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెస్ వంద పాయింట్లకు పైనే నష్టపోగా.. నిఫ్టీ 30పాయింట్లు లాస్‌తో ముగిశాయి. ప్రారంభం నుంచే నష్టాలతో మొదలైన సూచీలు.. చివరికి నష్టాలతోనే సరిపెట్టుకుంది. కేంద్ర బడ్జెట్‌తో స్టాక్ మార్కెట్లో కొత్త ఉత్సాహం నిండుకుంటుంది అనుకుంటే ఫలితం రివర్స్ అయింది. మదుపరులు అమ్మకాలకే ఎక్కువగా మొగ్గు చూపడంతో.. నష్టాలు తప్పలేదు. మారుతి సుజుకీ, సిప్లా, టాప్ గెయినర్స్ గా నిలువగా.. అల్ట్రా టెక్, ఎల్ అండ్ టీ, రెడ్డీస్ ల్యాబ్ అత్యధిక నష్టాలను మూటగట్టుకుంది.