దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోమారు లాభాల బాట..
* తొలి సెషన్ లో భారీ లాభాల్లో దూసుకుపోయిన సూచీలు.. * మలి సెషన్ లోనూ అదే ట్రెండ్ ను కొనసాగిస్తున్న వైనం.
దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోమారు లాభాల బాట పట్టాయి. తాజావారం తొలి సెషన్ లో భారీ లాభాల్లో దూసుకుపోయిన సూచీలు మలి సెషన్ లోనూ అదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 15,400 పాయింట్ల మార్క్ ను చేరుకుంది. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 306 పాయింట్ల లాభంతో 52,460 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు ఎగసి 15,400 వద్ద కదలాడుతున్నాయి.గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు ఎఫ్‌ఐఐ పెట్టుబడుల వెల్లువ, రిటైల్ ద్రవ్యోల్బణం కనిష్ఠానికి చేరడం, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిలోకి రావడం వంటి అంశాలు సానుకూల సంకేతాలు మదుపర్ల సెంటిమెంటును పెంచుతున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.