Stock Market: భారీ నష్టాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు
Stock Market: గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం * ఆరంభంలో సెన్సెక్స్ 1050 , నిఫ్టీ 323 పాయింట్ల మేర నష్టాలు
Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగడ్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో దేశీ స్టాక్ సూచీలు తాజా వారం తొలి సెషన్ లో ప్రతికూల బాటన ట్రేడింగ్ ఆరంభించాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ వెయ్యి 50 పాయింట్లు, నిఫ్టీ 323 పాయింట్ల మేర నష్టాలు నమోదు చేశాయి. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రకంపనల నేపధ్యంలో పెరుతున్న లాక్‌డౌన్‌లు, వ్యాక్సిన్ కొరతకు సంబంధించిన వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్న అంచనాలు ఎదురవుతున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 1050 పాయింట్లు కోల్పోయి.. 48వేల 541 వద్ద, నిఫ్టీ 323 పాయింట్లు మేర స్వల్ప నష్టంతో 14వేల 511 వద్ద కదలాడుతున్నాయి. కాగా బుధవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు కావడంతో ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి.