Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభ నష్టాల మిశ్రమం
Stock Market: నష్టాల్లో ఆరంభించి వారాంతాన సైతం నష్టాల్లోనే క్లోజ్ * మూడ్రోజుల పాటు వరుస లాభాల్లో సాగిన సూచీలు
Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభించి వారాంతాన సైతం నష్టాల్లోనే ముగించాయి. మూడ్రోజుల పాటు వరుస లాభాల్లో సాగిన సూచీలు వారాంతాన తిరిగి నష్టాలను మిగిల్చాయి దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనల నడుమ లాక్ డౌన్ భయాందోళనలు మార్కెట్ ను అతలాకుతలం చేశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 49,591 వద్దకు చేరగా. నిఫ్టీ 39 పాయింట్లను కోల్పోయి 14,835 వద్ద నిలిచింది.వారం ప్రాతిపదికన చూస్తే సెన్సెక్స్ 439 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు మేర నష్టపోయాయి.ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం వరుసగా ఐదు రోజులపాటు కొనసాగింది. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా కొనసాగారు. ఎఫ్‌ఐఐలు 645 కోట్ల రూపాయల షేర్లను, డీఐఐలు 271 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.