Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఆహారం.. ఎలాగో తెలుసా?
Indian Railways Update: రైలులో తరుచుగా ప్రయాణిస్తున్నారా.. అయితే, ఈ వార్త మీకోసమే. అవును, ప్రత్యేక పరిస్థితుల్లో కోట్లాది మంది ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు.
Indian Railways Update: రైలులో తరుచుగా ప్రయాణిస్తున్నారా.. అయితే, ఈ వార్త మీకోసమే. అవును, ప్రత్యేక పరిస్థితుల్లో కోట్లాది మంది ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు. రైల్వేశాఖ ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణికులకు ఉచితంగా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకారం.. ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందజేస్తామని చెప్పారు. మీరు కూడా రైలులో ప్రయాణిస్తున్నట్లయితే, రైల్వే నియమాలను గుర్తుంచుకోవాలి. తద్వారా మీకు ఉచిత ఆహారం కూడా లభిస్తుంది. ఏ ప్రయాణికులకు ఈ సదుపాయం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయాణీకులు ఆహారం కోసం చెల్లించాల్సిన అవసరం లేదు..
రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణించే ప్రయాణికులు ఆహారం కోసం చెల్లించాల్సిన అవసరం లేదు. రైల్వే ద్వారా ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. చాలాసార్లు సద్వినియోగం చేసుకోలేక పోతున్న అలాంటి సదుపాయం గురించి ఈసారి చెబుతున్నాం. అనేక సార్లు రైలు నిర్ణీత సమయం నుంచి ఆలస్యంగా వస్తుంది. అయితే రైలు ఆలస్యమైనప్పుడు మీకు రైల్వే వైపు నుంచి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారని మీకు తెలుసా?
IRCTC నియమం:
IRCTC నియమం ప్రకారం, ప్రయాణీకులకు ఉచిత ఆహార సౌకర్యం అందిస్తారు. మీ రైలు గమ్యస్థానానికి చేరుకోవడానికి 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయినప్పుడు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికులు మాత్రమే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. శతాబ్ది, రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు కూడా ప్రయాణంలో ఆలస్యం అయితే, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ట్రైన్ మిస్ అయితే, డబ్బు వాపస్..
రైల్వే నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు కూడా ఈ సదుపాయాన్ని పొందుతారు. మీరు ఏ కారణం చేతనైనా మీ రైలును కోల్పోయినప్పటికీ, నిబంధనల ప్రకారం మీరు వాపసు పొందవచ్చు. దీని కోసం, మీరు రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన గంటలోపు TDR ఫారమ్‌ను నింపి టికెట్ కౌంటర్‌లో సమర్పించాల్సి ఉంటుంది.