Stock Markets: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన దూకుడు
Stock Markets: తాజా వారంలో బెంచ్ మార్క్ సూచీలు 2 శాతానికి పైగా పెరగడంతో దేశీ మార్కెట్ లాభాల బాటన
Stock Markets: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన దూకుడుగా సాగాయి. తాజా వారంలో బెంచ్ మార్క్ సూచీలు 2 శాతానికి పైగా పెరగడంతో దేశీ మార్కెట్ లాభాల బాటన దౌడు తీశాయి. అయితే వారాంతానికి వచ్చేసరికి చివరి రెండు సెషన్లలోనూ సూచీల బలహీన ధోరణి లాభాలను గణనీయంగా తగ్గించింది. వారం ప్రాతిపదికన చూస్తే బిఎస్ఇ సెన్సెక్స్ 2.6 శాతం మేర లాభాలను నమోదు చేయగా... ఎన్ఎస్ఇ నిఫ్టీ సైతం 2.8 శాతం పెరిగింది... విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లేదా ఎఫ్ఐఐలు 2 వేల 199.74 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు లేదా డిఐఐలు 2 వేల 635.39 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశీ స్టాక్ మార్కెట్లు వారంలో జరిగిన తొలి మూడు ట్రేడింగ్ సెషన్లలోనూ లాభాల ర్యాలీ జరిపాయి....అయితే అధిక స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ ఫలితంగా మూడురోజుల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ఫలితంగా చివరి రెండు సెషన్లలోనూ దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టాయి..అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, డాలర్ మారకంలో రూపాయి పతనం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు అక్టోబరు-డిసెంబరు జీడీపీ గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదు కావడం తదితర సానుకూల అంశాల నేపధ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లు మూడ్రోజుల పాటు లాభాల బాటన సాగాయి..అయితే గురువారం వచ్చేసరికి దేశీయ స్టాక్ మార్కెట్లు యూ-టర్న్ తీసుకుని నష్టాల బాటన కొనసాగాయి.గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ వెరసి బెంచ్ మార్క్ సూచీలు ప్రధాన మద్దతుస్థాయిలకు దిగువన కదలాడాయి..వీకెండ్ సెషన్ లోనూ భారీ నష్టాలను మూటగట్టాయి.
ఇక ఫారెక్స్ మార్కెట్ లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ లాభాల బాటన 44 పైసలు మేర పెరిగి 73.02 వద్ద స్థిరపడింది..మరోవైపు గ్లోబల్ మార్కెట్ లో ముడిచమురు ధరలు ఏడాది గరిష్టానికి చేరాయి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 4.2 శాతం మేర ఎగసి 66.74 డాలర్ల వద్ద రికార్డ్ స్థాయిని నమోదు చేసింది.