Income Tax: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లించేవారు అలర్ట్‌.. రూ. 8 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం..!

Income Tax: ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం మీరు 2 లక్షల వరకు వడ్డీ చెల్లింపుపై పన్ను మినహాయింపు పొందవచ్చు...

Update: 2022-03-17 08:06 GMT

Income Tax: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లించేవారు అలర్ట్‌.. రూ. 8 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం..!

Income Tax: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు తేది మార్చి 31 అని గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఫైల్ చేయకుంటే త్వరపడండి. అలాగే పెట్టుబడులు, ఆదాయాలు, ఇతర రకాల చెల్లింపులపై క్లెయిమ్ చేయగల కొన్ని పన్ను మినహాయింపుల గురించి తెలుసుకుందాం. మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద అన్ని పన్ను మినహాయింపులను పొందుతారు.

ఉదాహరణకు మీరు LIC పాలసీని తీసుకున్నట్లయితే దాని ప్రీమియంను క్లెయిమ్ చేయవచ్చు. మీరు ప్రావిడెంట్ ఫండ్, PPF, పిల్లల ట్యూషన్ ఫీజు, జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం, గృహ రుణం ప్రిన్సిపాల్‌పై 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. మీరు LIC లేదా సెక్షన్ 80CCC కింద ఏదైనా ఇతర బీమా కంపెనీకి చెందిన యాన్యుటీ ప్లాన్ (పెన్షన్ ప్లాన్)ని కొనుగోలు చేసినట్లయితే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. మీరు సెక్షన్ 80 CCD (1) కింద కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్‌ను కొనుగోలు చేసినట్లయితే పన్ను క్లెయిమ్ చేయవచ్చు. ఇవన్నీ కలిపితే రూ.1.5 లక్షలకు మించదని గుర్తుంచుకోండి.

మీరు హోమ్ లోన్ ప్రధాన చెల్లింపుపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఈ పరిమితి 1.5 లక్షలకు మించకూడదు. కాబట్టి 80C కింద మీ మిగిలిన మినహాయింపులు 1.5 లక్షల కంటే తక్కువ ఉంటే మీరు హోమ్ లోన్ అసలు మొత్తం నుంచి ఈ పరిమితిని చేరుకోవడం ద్వారా పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అలాగే ఆదాయపు పన్ను సెక్షన్ 24(బి) కింద చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు పొందుతారు.

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం మీరు 2 లక్షల వరకు వడ్డీ చెల్లింపుపై పన్ను మినహాయింపు పొందవచ్చు. మీరు కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ అయిన నేషనల్ పేమెంట్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెడితే సెక్షన్ 80 CCD (1B) కింద రూ. 50,000 అదనపు మినహాయింపు పొందుతారు. ఈ మినహాయింపు సెక్షన్ 80 (సి) కింద పొందే రూ.1.5 లక్షల పన్ను మినహాయింపుపై ఉంటుంది. మీరు ఏదైనా ఆరోగ్య బీమా తీసుకున్నట్లయితే రెగ్యులర్ హెల్త్ చెకప్ పొందినట్లయితే మీరు సెక్షన్ 80D కింద ప్రీమియంను క్లెయిమ్ చేసుకోవచ్చు.

మీరు మీ జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా పాలసీని తీసుకున్నట్లయితే మీరు రూ.25,000 వరకు ప్రీమియంను క్లెయిమ్ చేయవచ్చు. ఈ సందర్భంలో తల్లిదండ్రుల వయస్సు 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే పన్ను మినహాయింపు పరిమితి రూ. 50,000. ఇందులో రూ. 5000 హెల్త్ చెకప్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే పన్ను మినహాయింపు ఆరోగ్య బీమా ప్రీమియం కంటే మించకూడదు.

Tags:    

Similar News