ATM Money: ఏటీఎం నుంచి 4 సార్లు డబ్బులు విత్ డ్రా చేస్తే రూ.173 కట్ అవుతున్నాయా..?
ATM Money: ఏటీఎం నుంచి 4 సార్లు డబ్బులు విత్ డ్రా చేస్తే రూ.173 కట్ అవుతున్నాయా..?
ATM Money: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా విషయాలు వైరల్ అవుతుంటాయి. అయితే ఇందులో నిజమెంత అనేది చాలామందికి తెలియదు. అయినప్పటికీ కొంతమంది ఈ మెస్సేజ్‌ని అందరికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అమాయక ప్రజలని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందుకే నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో మీ ఏటీఎం నుంచి నెలలో నాలుగు సార్లు కంటే ఎక్కువ డబ్బు విత్ డ్రా చేస్తే ఒక్కో లావాదేవీకి రూ. 173 కట్ అవుతున్నట్లుగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నాలుగుసార్లకు మించి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే పన్ను కింద రూ.150, సర్వీస్ ఛార్జీగా రూ.23 చెల్లించాల్సి ఉంటుందని ఈ వైరల్ మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు. అంటే మొత్తం రూ.173 చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1 నుంచి బ్యాంకులు ఈ నిబంధనను అమలు చేస్తున్నాయని ఈ మేస్సేజ్‌లో పేర్కొంటున్నారు. అయితే ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ప్రభుత్వం తరపున పిఐబి అనే ఫ్యాక్ట్‌చెక్ సంస్థ ఉంది.
అది ఈ వైరల్ మెసేజ్‌పై విచారణ జరిపి పూర్తిగా ఫేక్ అని నిర్ధారించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లేదా మరే ఇతర బ్యాంకు అటువంటి ఆర్డర్ ఇవ్వలేదని తెలిపింది. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసే నిబంధనలలో ఎటువంటి మార్పు చేయలేదని ఈ మెస్సేజ్‌ని ఎవ్వరూ నమ్మవద్దని అలాగే ఫార్వర్డ్ చేయ వద్దని సూచించింది.
दावा: ATM से 4 से अधिक बार पैसे निकालने पर ₹173 काटे जाएंगे। #PIBFactCheck▶️यह दावा फर्जी है।▶️अपने बैंक के ATM से हर माह 5 मुफ्त ट्रैन्ज़ैक्शन किए जा सकते हैं।▶️इसके बाद अधिकतम ₹21/ट्रांजैक्शन या कोई टैक्स होने पर वह अलग से देना होगा।— PIB Fact Check (@PIBFactCheck) July 11, 2022