LIC Policy: ఎల్‌ఐసీ సూపర్‌ టర్మ్‌ ప్లాన్‌.. 50 లక్షల ప్రయోజనం..!

LIC Policy: టర్మ్‌ ప్లాన్‌లు కుటుంబ భవిష్యత్‌ని పూర్తిగా కాపాడుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

Update: 2022-06-26 06:30 GMT

LIC Policy: ఎల్‌ఐసీ సూపర్‌ టర్మ్‌ ప్లాన్‌.. 50 లక్షల ప్రయోజనం..!

Lic Policy: టర్మ్‌ ప్లాన్‌లు కుటుంబ భవిష్యత్‌ని పూర్తిగా కాపాడుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఎల్‌ఐసీ అందించే టెక్ టర్మ్ ప్లాన్ సూపర్‌గా ఉంటుంది. ఈ పాలసీలో కనీసం రూ. 50 లక్షల వరకు బీమా ప్లాన్‌ను పొందవచ్చు. ఇతర టర్మ్ ప్లాన్‌ల మాదిరిగానే పాలసీ దారుడి మరణాంతరం కుటుంబానికి ఇది ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.

ఇది ఎల్‌ఐసీ చౌకైన టర్మ్ ప్లాన్. ఈ పథకాన్ని 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులందరూ కొనుగోలు చేయవచ్చు.ఇందులో మీరు తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా 50 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. మరణ ప్రయోజనంతో పాటు నామినీని ఎంపిక చేసుకోవచ్చు. మహిళలు ఈ పాలసీని కొనుగోలు చేస్తే వారికి ప్రీమియం చెల్లింపులో ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది.

పాలసీ నిబంధనలు

ఈ ప్లాన్‌ని ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చు. టెక్ టర్మ్ ప్లాన్‌ను కనీసం 10 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలకు కొనుగోలు చేయవచ్చు. సొంత ఆదాయం ఉన్న వారు మాత్రమే ఈ టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ టర్మ్ ప్లాన్ పాలసీదారు 80 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే పని చేస్తుంది.

మూడు ప్రీమియం చెల్లింపు ఎంపికలు

ఈ టెక్ టర్మ్ ప్లాన్‌లో మూడు విధాలుగా చెల్లింపు చేయవచ్చు. రెగ్యులర్, లిమిటెడ్, సింగిల్. రెగ్యులర్ ప్రీమియం అంటే మీరు పాలసీ తీసుకున్న సంవత్సరాలకు. పరిమిత ప్రీమియంలో, పాలసీ మొత్తం వ్యవధిలో 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి. సింగిల్ ప్రీమియం ఆప్షన్‌లో పాలసీ తీసుకునేటప్పుడు అన్ని ప్రీమియంలను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది.

డెత్ బెనిఫిట్ తెలుసుకోండి

టెక్ టర్మ్ ప్లాన్‌లో పాలసీదారు పాలసీ వ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే ఎటువంటి డబ్బులు రావు. అయితే ఒకవేళ పాలసీదారు మరణిస్తే నామినీకి అతని వార్షిక ఆదాయం కంటే 7 రెట్లు ఎక్కువ డబ్బు లభిస్తుంది. బీమా చేసిన వ్యక్తి మరణించిన తేదీ వరకు నామినీ మొత్తం ప్రీమియంలో 105 శాతం పొందుతారు. ఒకే ప్రీమియం చెల్లించే పాలసీదారు మరణించిన సందర్భంలో నామినీకి సింగిల్ ప్రీమియంలో 125% లభిస్తుంది.

Tags:    

Similar News