ఉద్యోగులకి అలర్ట్.. భవిష్యత్‌లో ఈ సమస్య రావొద్దంటే మేల్కొనండి..!

ఉద్యోగులకి అలర్ట్.. భవిష్యత్‌లో ఈ సమస్య రావొద్దంటే మేల్కొనండి..!

Update: 2022-09-11 13:30 GMT

ఉద్యోగులకి అలర్ట్.. భవిష్యత్‌లో ఈ సమస్య రావొద్దంటే మేల్కొనండి..!

Personal Finance: ఉద్యోగం చేసేవారైనా, వ్యాపారం చేసేవారైనా భవిష్యత్‌లో వచ్చే ఆర్థిక సమస్యలని ఎదుర్కోవాలంటే ఒక ప్లానింగ్‌ అవసరం. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందుకోసం 50-30-20 నియమం బాగా పనిచేస్తుంది. ఇది మీ బడ్జెట్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. పొదుపు చేయాలనే కోరికని పెంచుతుంది. ఈ నియమాన్ని పాటించే వ్యక్తులు భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం నుంచి సులువుగా బయటపడుతారు. జీవితంలో ఎటువంటి సమస్య లేకుండా గడుపుతారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ప్రతి నెల పొదుపు చేయాలి. నెలకు రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించినా ఎంతో కొంత పొదుపు చేయాలి. వ్యక్తిగత ఫైనాన్స్‌లో 50-30-20 నియమం ఖర్చు, సంపాదన, పొదుపును సూచిస్తుంది. ఈ నియమం ఆధారంగా మీ జీతంలో 50 శాతం అవసరమైన ఖర్చులతో ముగుస్తుంది. కానీ మీకు అవసరం లేని సినిమాలు, షాపింగ్, వెకేషన్ ఖర్చులు మొదలైనవి వదులుకోవాలి. ఎటువంటి సందర్భంలోనైనా 20 శాతం పొదుపు కోసం సేవ్‌ చేయాలి.

మీ నెలవారీ జీతం రూ.50,000 అనుకుంటే అందులో 30 శాతం పొదుపు చేయాలి. ఈ పరిస్థితిలో మొదట దాని నుంచి 15000 రూపాయలు పక్కన పెట్టాలి. అనవసరమైన ఖర్చులను ఆపాలి. మిగిలిన డబ్బుతో నెలవారీ ఖర్చులను నడపడానికి ప్రయత్నించాలి. పొదుపు పెంచుకోవడం అలవాటు చేసుకోవాలి. డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టాలి. అత్యవసర ఖర్చుల కోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు లేనప్పుడు కుటుంబ భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.

Tags:    

Similar News