Pension Scheme: రోజుకి 2 రూపాయలు పొదుపు చేస్తే ఏడాదికి రూ.36,000 వేల పెన్షన్‌..!

Pension Scheme: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కూడా పెన్షన్ అందిస్తోంది.

Update: 2022-06-22 04:30 GMT

Pension Scheme: రోజుకి 2 రూపాయలు పొదుపు చేస్తే ఏడాదికి రూ.36,000 వేల పెన్షన్‌..!

Pension Scheme: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కూడా పెన్షన్ అందిస్తోంది. ఇందుకోసం ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని కింద వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఇలా అసంఘటిత రంగానికి చెందిన ప్రతి ఒక్కరు పెన్షన్‌ పొందవచ్చు. వీరందరికి ప్రభుత్వం పింఛను హామీ ఇస్తోంది. ఈ పథకంలో రోజుకు కేవలం రూ. 2 ఆదా చేయడం ద్వారా మీరు సంవత్సరానికి రూ. 36000 పెన్షన్ పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

నెలకు 55 రూపాయలు

ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత మీరు ప్రతి నెలా 55 రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే 18 ఏళ్ల వయసులో రోజుకు దాదాపు రూ.2 పొదుపు చేయడం ద్వారా ఏటా రూ.36000 పెన్షన్ పొందవచ్చు. ఒక వ్యక్తి 40 సంవత్సరాల వయస్సు నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తే అతను ప్రతి నెలా 200 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీకు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. 60 సంవత్సరాల తర్వాత మీకు నెలకు రూ. 3000 అంటే సంవత్సరానికి రూ. 36000 పెన్షన్ వస్తుంది.

అవసరమైన పత్రాలు

ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీరు తప్పనిసరిగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. వ్యక్తి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

ఎక్కడ నమోదు చేసుకోవాలి

దీని కోసం మీరు కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లో నమోదు చేసుకోవాలి. ఈ పథకం కోసం ప్రభుత్వం వెబ్ పోర్టల్‌ను కూడా రూపొందించింది. ఈ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో మొత్తం సమాచారం భారత ప్రభుత్వానికి వెళ్తుంది. రిజిస్ట్రేషన్ కోసం మీ ఆధార్ కార్డ్, సేవింగ్స్ లేదా జన్ ధన్ బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, మొబైల్ నంబర్ అవసరం. ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ పెన్షన్ పథకం కింద అసంఘటిత రంగ కార్మికుడు 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఏ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోని వారు ఇందులో చేరవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి నెలవారీ ఆదాయం 15 వేల రూపాయల లోపు ఉండాలని గర్తుంచుకోండి.

Tags:    

Similar News