ప్రతిరోజు రూ.167 పొదుపు చేస్తే చివరకు 47 లక్షల లాభం..!
ప్రతిరోజు రూ.167 పొదుపు చేస్తే చివరకు 47 లక్షల లాభం..!
Post Office: పోస్టాఫీసు పథకాలు మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. మంచి రాబడిని అందిస్తాయి. అంతేకాక మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా ఒకరకమైన పొదపు పథకం అని చెప్పవచ్చు. ఇక్కడ పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు దీర్ఘకాలికంగా లక్షల రూపాయల ఫండ్‌ను సృష్టించవచ్చు. మీ డబ్బు పూర్తిగా సురక్షితం, ఇంకా పన్ను రహితంగా ఉంటుంది.రూ.16లక్షల మెచ్యూరిటీ కోసం మీరు రోజుకు రూ.167 అంటే నెలకు రూ.5000 పెట్టుబడి పెట్టాలి.ప్రతి నెలా మీ PPF ఖాతాలో రూ. 5,000 డిపాజిట్ చేస్తే 15 సంవత్సరాల మెచ్యూరిటీతో మీరు రూ.16 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తారు.
వాస్తవానికి PPF ఖాతా లాక్-ఇన్ వ్యవధి 15 సంవత్సరాలు. మీరు దీన్ని 15 సంవత్సరాలకు పైగా ఆపరేట్ చేయాలనుకుంటే ఒక ఫారమ్‌ను పూరించాలి.15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత మీరు 5 సంవత్సరాల చొప్పున రెండుసార్లు పెంచుకోవచ్చు.మొత్తం 25 సంవత్సరాలలు మెయింటెన్ చేయవచ్చు. మీరు 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 16వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం వరకు నెలకు 5 వేల రూపాయల (రోజుకు రూ.167) కంట్రిబ్యూషన్‌ను కొనసాగిస్తే 25వ సంవత్సరం మెచ్యూరిటీలో మీరు 41లక్షల మొత్తాన్ని పొందుతారు.
41 లక్షలు ఎలా అయ్యాయి?
పోస్టాఫీసు PPF పథకం దీర్ఘకాలంలో సంపద సృష్టికి మెరుగైన పథకం. మీరు PPFలో ప్రతి నెలా రూ.5,000 పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.60,000 అవుతుంది. తర్వాత ఐదు సంవత్సరాల చొప్పున రెండు సార్లు పెంచితే 25 సంవత్సరాలకు ఖాతా మెచ్యూర్ అవుతుంది. అప్పుడు రూ.41.23 లక్షలు లభిస్తాయి. ఇందులో మీరు రూ. 15 లక్షల పెట్టుబడి పెడితే చివరకు రూ. 26.23 లక్షల లాభం ఉంటుంది.ఈ అమౌంట్ పూర్తి పన్ను రహితంగా ఉంటుంది.
త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ రేట్లు
PPF ప్రస్తుతం వార్షికంగా 7.1 శాతం వడ్డీని అందిస్తుంది. 41లక్షల నిధిని సృష్టించడం మీకు సులభం అవుతుంది. PPFలో కాంపౌండింగ్ వార్షిక ప్రాతిపదికన జరుగుతుంది. PPF ఖాతాలో ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ రేట్లను మారుస్తుంది. పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ 15ఏళ్లు.కానీ ఖాతాదారులు ఐదు సంవత్సరాల చొప్పున ఖాతా పొడగించుకునే సౌకర్యం ఉంటుంది.