ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే 2.25 కోట్లకి యజమాని అవుతారు..!

* పెన్షన్‌ రావడం చాలా కష్టంగా ఉంది. అందుకే ప్రభుత్వం అందించే ఈ సురక్షితమైన ప్లాన్‌లో పెట్టుబడి పెట్టండి. మంచి ఆదాయం సంపాదించండి.

Update: 2022-12-25 12:00 GMT

ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే 2.25 కోట్లకి యజమాని అవుతారు

Public Provident Fund: మీరు ప్రభుత్వ ఉద్యోగం చేసినా ప్రైవేట్‌ ఉద్యోగం చేసినా ప్రతి ఒక్కరికి రిటైర్‌మెంట్‌ ప్లాన్‌ ఉండాలి. అప్పుడే ఉద్యోగం తర్వాత జీవితాన్ని హాయిగా గడపవచ్చు. ఈ రోజుల్లో పెన్షన్‌ రావడం చాలా కష్టంగా ఉంది. అందుకే ప్రభుత్వం అందించే ఈ సురక్షితమైన ప్లాన్‌లో పెట్టుబడి పెట్టండి. మంచి ఆదాయం సంపాదించండి. ఈ ప్లాన్‌ గురించి తెలుసుకుందాం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం అందరికి తెలిసిందే. సమీపంలోని పోస్టాఫీసు లేదా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. ఇందులో కనీసం రూ.500 నుంచి రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇందులో జమ చేసిన డబ్బుకు వడ్డీ ఏడాది చివరి రోజున జమవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం 7.1 శాతం వడ్డీని చెల్లిస్తోంది.

మీరు 25 ఏళ్ల వయస్సులో ఖాతా తెరిచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ఖాతాలో రూ.1.5 లక్షలు జమచేస్తే ఈ రేటుతో వచ్చే ఏడాది మార్చి 31న మరో రూ.10,650 ఖాతాలో జమ అవుతుంది. ఆర్థిక సంవత్సరం మొదటి రోజున మీ ఖాతాలో మొత్తం రూ. 1,60,650 అవుతుంది. వచ్చే ఏడాది మళ్లీ రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఈ మొత్తం రూ.3,10,650కి పెరిగి దానిపై రూ.22,056 లాభం వస్తుంది. ఈ విధంగా 15 సంవత్సరాల పాటు డబ్బును డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఖాతాలో రూ.40,68,209 జమ అవుతుంది.

దీన్ని మరింత పొడిగించవచ్చు. ఖాతా 20 సంవత్సరాలు పూర్తయినప్పుడు మొత్తం రూ. 66,58,288 అవుతుంది. అదే విధంగా మీ ఖాతా 35 సంవత్సరాల పాటు నడుస్తుంటే మీరు రూ. 2 కోట్ల 26 లక్షల మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతారు.

Tags:    

Similar News