RBI Rules: ఒకటి కంటే ఎక్కువ ఖాతాలున్నాయా.. అయితే నష్టమే..!

RBI Rules: మీరు బ్యాంకులో ఖాతా ఓపెన్‌ చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి.

Update: 2022-10-09 04:59 GMT

RBI Rules: ఒకటి కంటే ఎక్కువ ఖాతాలున్నాయా.. అయితే నష్టమే..!

RBI Rules: మీరు బ్యాంకులో ఖాతా ఓపెన్‌ చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి. కోట్లాది మంది ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ భారీ సమాచారం అందించింది. చాలామందికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలుంటాయి. దీనివల్ల నష్టం తప్పించి లాభం ఏమి ఉండదు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చెబుతుందో తెలుసుకుందాం.

వాస్తవానికి ఖాతాలు ఓపెన్‌ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి పరిమితిని నిర్ణయించలేదు. కస్టమర్ 2, 4 లేదా 5 ఎన్ని ఖాతాలనైనా తెరవవచ్చు. ఆర్‌బీఐ ఎలాంటి పరిమితిని జారీ చేయలేదు. అయితే చాలా ఖాతాలు ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. బ్యాంకు ఖాతా తెరవడంతో పాటు మీరు దాని మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్ చేయాలి. ఇది కాకుండా మీరు అనేక ఇతర ఛార్జీలని చెల్లించాల్సి ఉంటుంది.

మీరు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉంటే మెయింటనెన్స్‌ ఛార్జీలు, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలతో సహా అనేక ఛార్జీలను చెల్లించాలి. అదే ఒకే ఖాతా ఉంటే ఒక బ్యాంకుకు మాత్రమే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు చాలా బ్యాంకుల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూ.5000, మరికొన్ని బ్యాంకుల్లో రూ.10,000 ఉంటుంది. దీని కంటే తక్కువగా ఉంచినట్లయితే పెనాల్టీని చెల్లించాలి. ఇది మీ CIBIL స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. మీరు అనవసరమైన ఖాతాలను మూసివేయాలంటే RBI చెప్పిన ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. తద్వారా అలాంటి ఖాతాలని మూసివేయవచ్చు. మీరు D-లింక్ ఫారమ్‌ను పూరించాలి. బ్యాంక్ సంప్రదించి ఖాతా మూసివేత ఫారమ్‌ను పొందుతారు. దీన్ని నింపి బ్యాంకులో సమర్పించిన తర్వాత ఖాతా క్లోజ్‌ అవుతుంది.

Tags:    

Similar News