ఏటీఎం నుంచి డబ్బులు రాకుండానే డబ్బులు కట్‌ అయినట్లు మెస్సేజ్‌ వచ్చిందా.. అప్పుడు ఇలా చేయండి..!

ATM Money Receiving: ప్రతిసారి డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లలేం అందుకే బ్యాంకులు ఏటీఎంలను ఏర్పాటు చేశాయి.

Update: 2023-12-09 06:17 GMT

ఏటీఎం నుంచి డబ్బులు రాకుండానే డబ్బులు కట్‌ అయినట్లు మెస్సేజ్‌ వచ్చిందా.. అప్పుడు ఇలా చేయండి..!

ATM Money Receiving: ప్రతిసారి డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లలేం అందుకే బ్యాంకులు ఏటీఎంలను ఏర్పాటు చేశాయి. వీటి ద్వారా ఎక్కడైనా సులువుగా డబ్బులు తీసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఏటీఎంలు సరిగ్గా పనిచేయవు. దీనివల్ల డబ్బులు రాకముందే వచ్చినట్లుగా మొబైల్‌కి మెస్సేజ్‌ రావడం జరుగుతుంది. దీంతో చాలామంది టెన్షన్ పడుతారు. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఏం చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

బ్యాంకులు సాంకేతిక సమస్యల కారణంగా వచ్చిన అన్ని సమస్యలను త్వరగా పరిష్కరిస్తాయి. కాబట్టి డబ్బులు కట్‌ అయిందని మెస్సేజ్‌ వస్తే మళ్లీ మీ డబ్బు తిరిగి మీ ఖాతాకు జమ అవుతాయి. దీని గురించి మెస్సేజ్‌ కూడా వస్తుంది. అలాగే మీ కార్డ్‌ని మెషీన్‌లో చొప్పించే ముందు స్లాట్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. ఒక్కోసారి స్కామర్లు ఏటీఎం ద్వారా కార్డు వివరాలను దొంగిలించే అవకాశం ఉంది. స్లాట్‌లోకి స్కిమ్మర్ పెట్టి మాగ్నెటిక్ స్ట్రిప్ నుంచి మొత్తం డేటాను దొంగిలిస్తారు. ఈ సమాచారంతో అకౌంట్‌లోని డబ్బులను దోచేస్తారు.

మరో పద్దతిలో డబ్బులు కట్‌ అయిన వెంటనే బ్యాంక్‌ 24 గంటల కస్టమర్ సర్వీస్ లైన్‌కు కాల్ చేసి చెప్పాలి. ఏడు రోజుల్లో ఆ డబ్బులను కస్టమర్ ఖాతాలో జమ చేస్తారు. లేదంటే ఆలస్యమైన చెల్లింపునకు బ్యాంకు రోజుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మీరు సమీపంలోని బ్యాంకుకి వెళ్లి హెల్ప్‌డెస్క్‌తో ఈ విషయం గురించి చెప్పాలి. అప్పటికీ పట్టించుకోకుంటే బ్రాంచ్ మేనేజర్‌ని సంప్రదించాలి. మరో విధంగా బ్యాంక్ వెబ్‌సైట్‌కి కూడా వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. అయినప్పటికీ బ్యాంకు మీ సమస్యను పరిష్కరించకుంటే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ని సంప్రదించాలి. సమస్య గురించి మెయిల్ పెట్టాలి. 30 రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తుంది. చివరగా ఎన్‌సీడీఆర్‌సీ వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం కోర్టు దృష్టికి కూడా తీసుకుపోవచ్చు.

Tags:    

Similar News