Investment Idea: నెలకి రూ.25,000 సంపాదిస్తే చాలు కోటీశ్వరులు కావొచ్చు.. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములాలో అది సాధ్యమే..!
Investment Idea: జీవితంలో చాలా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
Investment Idea: జీవితంలో చాలా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఇది అందరికి సాధ్యం కాదు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ నెలకు లక్షల రూపాయాల్లో జీతం తీసుకునేవారికి ఇది సులువుగా సాధ్యం అవుతుంది. కానీ నెలకు రూ. 25 వేల నుంచి 30 వేల జీతం తీసుకునే వారు కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయమా అనుకొని వెనకడుగువేస్తూ ఉంటారు. అయితే తలుచుకుంటే వారికి కూడా ఇది సాధ్యమే ఇందుకు ఒక ఇన్వెస్ట్ మెంట్ ఫార్మూలా అప్లై చేయాలి. అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం.
మీరు చిన్న చిన్న పొదుపు చేసినా దీర్ఘకాలిక పెట్టుబడితో కోటీశ్వరుడు కావాలనే మీ కలను నెరవేర్చుకోవచ్చు. మీరు తక్కువ జీతంతో భారీ నిధిని క్రియేట్ చేయవచ్చు. ఇందుకోసం SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చిన్న పొదుపులతో పెద్ద ఫండ్‌ని సృష్టించవచ్చు. దీని కోసం మీరు చాలా కాలం పాటు నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. మీరు సిప్ లో కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. తక్కువ ఇన్వెస్ట్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు.
మీ జీతం రూ. 25000 అయితే పెట్టుబడి పెట్టే ముందు మీ అవసరాలను చూసుకోవడం ముఖ్యం. మీ జీతంలో 15నుంచి 20 శాతం పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిబంధన చెబుతోంది. రూ.25 వేలు జీతం ఉన్నవారు రూ.4000 నుంచి రూ.5000 మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మీరు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. మార్కెట్‌తో ముడిపడి ఉండటం వల్ల ఇందులో కొంత ప్రమాదం ఉందని గుర్తించాలి. మీరు అనుకున్న రాబడిని పొందలేకపోవచ్చు కానీ కొన్ని సంవత్సరాల్లో సిప్ రాబడులు సగటున 12 శాతంగా ఉన్నాయి.
మీరు SIPలో రూ. 4000 పెట్టుబడి పెడితే, 12% రాబడి చొప్పున, మీరు 28 సంవత్సరాల్లో (339 నెలలు) రూ.1 కోటి ఫండ్‌ను సృష్టిస్తారు. మీరు SIPలో రూ. 5000 పెట్టుబడి పెడితే, రూ.1 కోటి ఫండ్‌ను సృష్టించడానికి 26 సంవత్సరాలు (317 నెలలు) పడుతుంది. మీరు మీ జీతంలో 30 శాతం అంటే దాదాపు రూ. 7000 పెట్టుబడి పెడితే 12 శాతం రాబడితో రూ. 1 కోటి ఫండ్‌ని సృష్టించడానికి 23 సంవత్సరాలు (276 నెలలు) పడుతుంది. జీతంలో 40 శాతం అంటే రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్లలో (248 నెలలు) కోటి రూపాయల ఫండ్ పొందుతారు.