Whatsapp: అలర్ట్.. వాట్సాప్‌లో ఈ తప్పులు చేస్తే అకౌంట్ బ్యాన్..!
Whatsapp: అలర్ట్.. వాట్సాప్‌లో ఈ తప్పులు చేస్తే అకౌంట్ బ్యాన్..!
Whatsapp: మీరు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ని ఉపయోగిస్తుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అక్టోబర్ నెలలో వాట్సాప్ వినియోగదారు భద్రతా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో 23 లక్షల 23 వేల మంది వినియోగదారుల ఖాతాలు నిషేధించామని తెలిపింది. వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు చేయకూడదని తప్పుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. అన్నింటిలో మొదటిది మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో వినియోగదారుని చేర్చినట్లయితే ముందుగా వారి అనుమతి తీసుకోండి.
2. వాట్సాప్‌లో మీకు తెలిసిన లేదా మీతో మాట్లాడాలనుకునే వినియోగదారులకు మాత్రమే మెస్సేజ్ పంపించండి.
3. ఒక వినియోగదారు నుంచి మరొకరికి పదేపదే ప్రచార లేదా ఫార్వార్డ్ మెస్సేజ్‌లని పంపకూడదు.
4. వాట్సాప్ సేవా నిబంధనలను ఎప్పుడూ ఉల్లంఘించవద్దు. నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఖాతా నిషేధానికి గురవుతుంది.
5. స్కామ్‌లు, ఫేక్ న్యూస్, ఏదైనా తప్పుగా ఉండే ఇతర విషయాలను షేర్ చేయకూడదని గుర్తుంచుకోండి.
23 లక్షల 23 వేల ఖాతాల్లో 8 లక్షల 11 వేల వాట్సాప్ ఖాతాలు వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకముందే నిషేధించబడ్డాయి. ప్రజల సమాచారం కోసం వాట్సాప్ ప్రతి నెలా ఐటీ రూల్స్ 2021 కింద నెలవారీ నివేదికను సిద్ధం చేస్తుంది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం అక్టోబర్ 2022 నివేదికను ప్రచురించామని వాట్సాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌లో వచ్చిన ఫిర్యాదులు, వాట్సాప్ తీసుకున్న చర్యల గురించి పేర్కొన్నామని చెప్పారు. అక్టోబర్‌లో 2.3 మిలియన్లు లేదా 23 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించామని తెలిపారు.