Post Office Recurring Deposit : ఈ స్కీమ్‎లో నెలకు రూ.1000 జమ చేస్తే చాలు..రూ.5లక్షల పైనే రిటర్న్స్

Post Office Recurring Deposit : ఈకాలంలో పొదుపు అనేది అందరికీ అవసరం. పొదుపు చేసేందుకు ఎన్నో స్కీంలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో పోస్టాఫీస్ రికవరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటని చెప్పవచ్చు. ఈ స్కీంలో తక్కువ మొత్తం జమ చేస్తే ఒకసారి పెద్ద మొత్తం తీసుకోవచ్చు. మీరు నెలకు రూ. 1000 చొప్పున జమచేస్తే..మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుంది. వడ్డీ ఎంత ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2024-07-05 06:02 GMT

Post Office Recurring Deposit : ఈ స్కీమ్‎లో నెలకు రూ.1000 జమ చేస్తే చాలు..రూ.5లక్షల పైనే రిటర్న్స్

Post Office Recurring Deposit : ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు..వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో చాలా అవసరానికి వస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా బతకాలన్నా..అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేందుకు వీలుగా పొదుపు చేస్తుంటారు చాలా మంది. అయితే మనం సంపాదించిన డబ్బును పొదుపు చేసేందుకు అందుబాటులో ఉన్న కొన్ని పెట్టుబడి పథకాల్లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ప్రస్తుతం ఈ రికరింగ్ డిపాజిట్ స్కీం మన దేశంలో పలు బ్యాంకులతోపాటు ఇండియన్ పోస్టు ఆఫీస్ ల్లో కూడా అందుబాటులో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటంతో బ్యాంకులతో పోల్చితే పోస్టాఫీసులోనే పొదుపు చేయడానికి ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ స్కీములో కొద్ది కొద్దిగా జమ చేస్తే పెద్దమొత్తంలో ఒకసారి తీసుకోవచ్చు. ఒకవేల మీరు నెలకు రూ. 1000 చొప్పున జమ చేసినట్లయితే..మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుంది. వడ్డీ ఎంత ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌పై 6.5 శాతం వడ్డీ రేటు పొందుతారు. ఈ పథకంలో మీరు రూ.100 నుంచి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. గరిష్ట పరిమిత అంటూ ఏమీ లేదు. మీరు ఈ స్కీంకు సింగల్ లేదా జాయింట్ అకౌంట్ తీసుకోవచ్చు.మీరు ఈ స్కీంలో చేరితే ప్రతి నెలా డబ్బులు జమ చేయాలి.ఈ స్కీమ్ టెన్యూర్ 5 సంవత్సరాలు. తర్వాత మీ డబ్బులను ఒకేసారి చెల్లిస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తంపై మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి పొందొచ్చు.

ఉదాహరణకు, మీరు రూ.1000 నెలవారీ చెల్లింపును ఎంచుకుంటే, మెచ్యూరిటీ తర్వాత మీకు జమ అయ్యే మొత్తం ఎంతో తెలుసుకుందాం. ఐదు సంవత్సరాల వ్యవధిలో, మీ మొత్తం డిపాజిట్ చేసేది రూ. 60,000. మీకు వడ్డీ రూపంలో రూ. 11000 వస్తాయి. మీరు మీ టెన్యూర్ మరొక 5 సంవత్సరాలు పొడిగించినట్లైతే, మీ డిపాజిట్ మొత్తం రూ. 1.2 లక్షలకు చేరుతుంది. దానికి వడ్డీతో కలిపి మొత్తం 1.69 లక్షలు వస్తాయి.

అలాగే మీరు మరో ఐదేండ్లు టెన్యూర్ పొడిగించుకుంటే.. అప్పుడు మీరు రూ. 2.4 లక్షలు పెట్టబడి పెట్టినట్లే. మీకు వడ్డీ రూపంలో రూ. 2.5 లక్షలు వస్తాయి. మీకు 20 ఏండ్లలో దాదాపు రూ.5 లక్షలు వస్తాయి. ఇలా మీ పెట్టుబడిపై మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. టెన్యూర్ ఆధారంగా కూడా రిటర్న్‌లో మార్పు ఉంటుంది.

Tags:    

Similar News