Agriculture: ఈ ఔషధ పండ్లు సాగు చేయండి.. సులువుగా ధనవంతులు అవ్వండి..!

Agriculture: నేరేడు పండ్లలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఇది చాలా రోగాలని నయం చేస్తుంది. అంతేకాదు ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

Update: 2023-08-04 11:01 GMT

Agriculture: ఈ ఔషధ పండ్లు సాగు చేయండి.. సులువుగా ధనవంతులు అవ్వండి..!

Agriculture: నేరేడు పండ్లలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఇది చాలా రోగాలని నయం చేస్తుంది. అంతేకాదు ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ పండు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీనికి ఆరోగ్య ఫల ప్రధాయిని అని పేరు. ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టి ఈ పండ్లకి ధర ఎక్కువగా ఉంటుంది. అందుకే రైతు సోదరులు ఈ పంట పండిస్తే సులువుగా ధనవంతులు అవుతారు. అంతేకాకుండా ప్రభుత్వ సబ్సిడీ కూడా లభిస్తుంది. దీని సాగు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

మొక్కలు సమాన దూరంలో నాటాలి

నేరేడు ఒక ఔషధ పండు. దీని నుంచి చాలా ఔషధాలను తయారు చేస్తారు. ఈ పంట సాగుకోసం ముందుగా పొలాన్ని దున్నుతారు. తరువాత పొలంలో ఆవు పేడను సేంద్రీయ ఎరువుగా ఉపయోగించవచ్చు. తరువాత జామున్ మొక్కలను సమాన దూరంలో నాటాలి. అలాగే పొలంలో మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి.

హెక్టారులో 250 మొక్కలు

నేరేడు మొక్కలు 4 నుంచి 5 సంవత్సరాలలో పండ్లు అందిస్తాయి. 8 సంవత్సరాల తర్వాత పూర్తిగా చెట్ల రూపాన్ని సంతరించుకుంటాయి. తరువాత పండ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దాదాపు ఒక చెట్టు నుంచి 80 నుంచి 90 కిలోల పండ్లను తీయవచ్చు. ఒక హెక్టారులో 250 కంటే ఎక్కువ మొక్కలు ఉంటాయి. కాబట్టి 20000 కిలోల వరకు పండ్లు పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక కిలో నేరేడు పండ్లకి రూ.140 పలుకుతోంది.

Tags:    

Similar News