RBI: పాత నోట్లు, కాయిన్స్ విక్ర‌యిస్తున్నారా.. ఆర్బీఐ ఏం చెబుతుందంటే..!

RBI: గత కొన్ని రోజులుగా పాత నాణేలు, నోట్ల కొనుగోలు, విక్రయాల జోరు బాగా పెరిగింది. చాలా మంది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాత నోట్లు , నాణేలను విక్రయిస్తున్నారు.

Update: 2022-03-09 09:30 GMT

RBI: పాత నోట్లు, కాయిన్స్ విక్ర‌యిస్తున్నారా.. ఆర్బీఐ ఏం చెబుతుందంటే..!

RBI: గత కొన్ని రోజులుగా పాత నాణేలు, నోట్ల కొనుగోలు, విక్రయాల జోరు బాగా పెరిగింది. చాలా మంది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాత నోట్లు , నాణేలను విక్రయిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆర్‌బిఐ ఇటీవల ఒక ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేసింది. వాస్త‌వానికి పాత నోట్లు , నాణేలను విక్రయించడానికి సెంట్రల్ బ్యాంక్ పేరు, లోగోను ఉప‌యోగించ‌డాన్ని ఆర్‌బిఐ ఖండించింది. ఈ కొనుగోళ్ల‌కి, ఆర్బీఐకి ఎటువంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది. కొంత‌మంది సైబ‌ర్ నేర‌స్థులు ఆర్బీఐ లోగోను అడ్డం పెట్టుకొని వినియోగ‌దారుల‌ని మోసం చేస్తున్నారు.

రిజర్వ్ బ్యాంక్ త‌న ట్వీట్‌లో "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు , లోగోని వివిధ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొంద‌రు తప్పుగా ఉపయోగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టికి వచ్చింది" అని ట్వీట్ చేసింది. పాత నోట్లు, నాణేలను విక్రయించడానికి ప్రజల ద‌గ్గ‌రి నుంచి క‌మిష‌న్ వ‌సూలు చేస్తున్న‌ట్లు తేలింది. రిజర్వ్ బ్యాంక్ తన ప్రకటనలో .. ఆర్బీఐ అటువంటి కార్యకలాపాలలో పాల్గొనదు. అలాంటి లావాదేవీల కోసం ఎవరి నుంచి కమీషన్ తీసుకోదు. ఇటువంటి ప‌నులు చేయ‌డానికి ఏ సంస్థకు లేదా వ్యక్తికి అధికారం ఇవ్వలేదని స్ప‌ష్టం చేసింది.

ఇలాంటి నకిలీ, మోసపూరిత ఆఫర్ల ఉచ్చులో పడవద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్ సాధారణ ప్రజలని హెచ్చ‌రించింది. పాత‌నోట్లు, కాయిన్స్ పేరుమీద ఆన్‌లైన్ వేదిక‌గా చాలా మోసాలు జ‌రుగుతున్నాయ‌ని ఇలాంటి వాటిపై వినియోగ‌దారులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించింది. సులువుగా డ‌బ్బు సంపాదించ‌డానికి సైబ‌ర్ నేర‌గాళ్లు ఇలాంటివారిని టార్గెట్ చేస్తున్న‌ట్లు తెలిపింది. ఆర్భీఐ పేరుతో చేసిన మోసాలు ఇటీవ‌ల చాల‌వ‌ర‌కు వెలుగులోకి వ‌చ్చాయి.

Tags:    

Similar News