Banking Fraud: బ్యాంకింగ్‌ మోసానికి గురైతే ఈ పని త్వరగా చేయండి.. డబ్బుని తిరిగి పొందవచ్చు..!

Banking Fraud: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్‌ ఉంటుంది. ఎవరైనా సులువుగా యాక్సెస్ చేయవచ్చు.

Update: 2022-08-22 04:30 GMT

Banking Fraud: బ్యాంకింగ్‌ మోసానికి గురైతే ఈ పని త్వరగా చేయండి.. డబ్బుని తిరిగి పొందవచ్చు..!

Banking Fraud: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్‌ ఉంటుంది. ఎవరైనా సులువుగా యాక్సెస్ చేయవచ్చు. ప్రభుత్వం కూడా ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యకం కల్పించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్దీ దాని దుర్వినియోగం కూడా పెరుగుతోంది. అనేక నేరాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ క్రైమ్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక చట్టం కూడా చేసింది. సైబర్ క్రైమ్‌లను నిరోధించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000ని ప్రభుత్వం అమలు చేస్తుంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ప్రకారం.. ఎలక్ట్రానిక్ మనీలాండరింగ్ పాల్పడడం సైబర్ నేరం. సంఘటన స్థలంలో ఒక వ్యక్తి భౌతికంగా ఉండవలసిన అవసరం లేదు. అదే విధంగా సైబర్ టెర్రరిజం కూడా సైబర్ క్రైమ్ విభాగంలోకి వస్తుంది. ఈ రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా ప్రజలను దోచుకోవడం, మోసం చేయడం ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్ మోసాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇలాంటి కేసులను నిరోధించేందుకు ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు.

ఒక వ్యక్తి బ్యాంకింగ్ మోసానికి పాల్పడినట్లు తేలితే అతనిపై IT చట్టం 2000లోని సెక్షన్లు 77B, 66D కింద చర్య తీసుకోవచ్చు. ఇది కాకుండా IPCలోని 419, 420, 465 సెక్షన్‌లను జోడించవచ్చు. బ్యాంకింగ్ మోసం విషయంలో వీలైనంత త్వరగా స్పందించాలి. మీరు ముందుగానే ఫిర్యాదు చేస్తేనే త్వరగా చర్య తీసుకుంటారు. అప్పుడే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఒక వ్యక్తి బ్యాంకింగ్ మోసానికి గురైనట్లయితే లేదా ఇతర సైబర్ నేరాలకు గురైనట్లయితే బాధితుడు భారత ప్రభుత్వ పోర్టల్ https://cybercrime.gov.in/ని సందర్శించడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా ఆ వ్యక్తి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సైబర్ క్రైమ్ వింగ్‌ని సంప్రదించవచ్చు.

Tags:    

Similar News