PF Rules: పీఎఫ్‌ ఖాతాదారుడు మరణిస్తే భార్యా పిల్లలకి పెన్షన్‌ వస్తుందా.. నియమాలు ఏంటంటే..?

PF Rules: ఉద్యోగం చేసే వ్యక్తి జీతంలో కొంత భాగాన్ని PFగా కట్‌ చేస్తారు. ఈ భాగం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాలో జమ అవుతుంది.

Update: 2022-05-13 11:30 GMT

PF Rules: పీఎఫ్‌ ఖాతాదారుడు మరణిస్తే భార్యా పిల్లలకి పెన్షన్‌ వస్తుందా.. నియమాలు ఏంటంటే..?

PF Rules: ఉద్యోగం చేసే వ్యక్తి జీతంలో కొంత భాగాన్ని PFగా కట్‌ చేస్తారు. ఈ భాగం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాలో జమ అవుతుంది. ప్రతి ఉద్యోగి ప్రాథమిక వేతనంలో 12 శాతం ఈ ఖాతాలో జమ చేస్తారు. అలాగే కంపెనీ కూడా అంతే మొత్తం అందిస్తుంది. ఈ 12 శాతం షేర్‌లో 8.33 శాతం ఈపీఎస్‌లో డిపాజిట్ అవుతుంది. ఉద్యోగి రిటైర్మెంట్‌ చేసినప్పుడు, అతను ఈ డబ్బును పెన్షన్‌గా పొందాలనేది దీని ఉద్దేశ్యం. దీంతో పాటు ఒక ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి అంటే భార్య / భర్త, పిల్లలకు ప్రతి నెలా EPF ద్వారా కుటుంబ పెన్షన్ అందజేస్తారు.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ విషయంపై సమాచారం ఇస్తూ.. EPS 95 పథకం కింద ఖాతాదారుడు మరణిస్తే అతని కుటుంబం అంటే అతని భార్య, పిల్లలు కుటుంబ పెన్షన్‌కి అర్హులవుతారు. దీనిపై EPFO​​ ట్వీట్ చేయడం ద్వారా సమాచారం తెలిపింది. ఖాతాదారుడు మరణిస్తే EPS 95 ప్రకారం.. అతని కుటుంబానికి (భార్య లేదా భర్త) కనీసం రూ. 1,000 నెలవారీ పెన్షన్ లభిస్తుంది.

దీంతో పాటు PF ఖాతాదారు వివాహం చేసుకోకపోతే PF నామినీ జీవితాంతం పెన్షన్ పొందుతారు. మరోవైపు భార్య, భర్త ఇద్దరూ మరణించినట్లయితే ఈ పరిస్థితిలో ఖాతాదారుడి పిల్లలకు ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. భార్యకు వచ్చే పింఛనులో 25 శాతం పిల్లలకు అందుతుంది. ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పింఛను లభిస్తుంది.

 

Tags:    

Similar News