మ్యూచ్‌వల్ ఫండ్స్‌ లేదా SIPలో పెట్టుబడి పెట్టారా.. ఈ పనిచేయకపోతే భారీ నష్టం..!

మ్యూచ్‌వల్ ఫండ్స్‌ లేదా SIPలో పెట్టుబడి పెట్టారా.. ఈ పనిచేయకపోతే భారీ నష్టం..!

Update: 2022-03-27 11:30 GMT

మ్యూచ్‌వల్ ఫండ్స్‌ లేదా SIPలో పెట్టుబడి పెట్టారా.. ఈ పనిచేయకపోతే భారీ నష్టం..!

PAN Aadhaar Link: మీరు మ్యూచువల్ ఫండ్స్ లేదా SIPలో డబ్బును ఇన్వెస్ట్ చేశారా అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీరు ఇప్పటివరకు పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయకపోతే మార్చి 31లోపు చేయండి. లేదంటే భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అంతేకాదు లింక్ చేయకోపోతే మీ పాన్ కార్డ్ చెల్లదు. ఇది మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కొత్త పెట్టుబడి పెట్టడం, పాత వాటి నుంచి డబ్బు విత్‌ డ్రా చేయడం కష్టమవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి పాన్ కార్డ్ కచ్చితంగా అవసరమని తెలిసిందే.

మీరు మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే లేదా మరేదైనా ఇతర స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పాన్ కార్డ్‌ని కలిగి ఉండాలి. మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే పాన్‌కార్డు చెల్లదు. అప్పుడు మీరు మీ ప్రస్తుత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడికి అదనపు యూనిట్లను యాడ్ చేయలేరు. అందుకే మీరు పాన్-ఆధార్‌ని లింక్ చేయడం ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్లు ఉండాలి.

ముందుగా మీరు మీ 'నో యువర్ కస్టమర్' (KYC) నిబంధనలను అనుసరించాలి. ఆపై మీకు చెల్లుబాటు అయ్యే PAN ఉండాలి. ఈ పరిస్థితిలో ఆధార్‌ను లింక్ చేయకపోవడం వల్ల మీ పాన్ చెల్లుబాటు కాకపోతే మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. మీరు పాన్-ఆధార్‌ను లింక్ చేయకపోతే మీ పాన్ చెల్లదు. దీనివల్ల సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కూడా ఆగిపోతుంది. డబ్బులు విత్‌ డ్రా చేసుకోలేరు. అందుకే మార్చి 31కి ముందు కచ్చితంగా పాన్, ఆధార్‌ను లింక్ చేయండి.

Tags:    

Similar News