ICICI Bank: విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫాం.. ఇక అన్ని విషయాలు ఇందులోనే..!

ICICI Bank: ప్రముఖ ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంని ప్రారంభించాలని నిర్ణయించింది.

Update: 2022-06-26 04:30 GMT

ICICI Bank: విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫాం.. ఇక అన్ని విషయాలు ఇందులోనే..!

ICICI Bank: ప్రముఖ ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంని ప్రారంభించాలని నిర్ణయించింది. దీనిపేరు క్యాంపస్ పవర్. ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. ఇది డిజిటల్ బ్యాంకింగ్‌తో పాటు వివిధ రకాల సమస్యలను అధిగమించడానికి విద్యార్థులకు సహాయపడుతుంది.

ఈ ప్లాట్‌ఫాం ద్వారా విద్యార్థులకు వివిధ రకాల విద్యా రుణాలు అందించడంలో బ్యాంకు సహకరిస్తుంది. అలాగే విదేశాల్లో నివసిస్తున్న తమ పిల్లలకు సులభంగా నిధులను బదిలీ చేస్తుంది. ఇతర బ్యాంకుల కస్టమర్లు కూడా ఈ ప్లాట్‌ఫాంని సద్వినియోగం చేసుకోవచ్చు. విదేశాల్లో చదువుతున్న మీ పిల్లలకు డబ్బు బదిలీ చేయడంతో పాటు ఎడ్యుకేషన్ లోన్, ఫారిన్ కరెన్సీ ఎక్స్ఛేంజ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సౌకర్యం వంటి అనేక సౌకర్యాలు అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా కస్టమర్లు పెట్టుబడిపై పన్ను రాయితీ ప్రయోజనాన్ని పొందుతారు.

ఈ వేదిక విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీని ద్వారా విద్యార్థులు అమెరికా, కెనడా, జర్మనీ, యుకె మొదలైన అనేక దేశాల కళాశాలలు, విశ్వవిద్యాలయాల గురించి సమాచారాన్ని పొందగలుగుతారు. ఇది కళాశాలలో ప్రవేశం, ఫీజులు, ప్రయాణ ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని విద్యార్థులకు అందిస్తుంది.  

Tags:    

Similar News