ఉద్యోగులకి శుభవార్త.. ఇప్పుడు ఈ అలవెన్స్ కూడా పెరిగే అవకాశం..!
Central Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో బంపర్ ఆఫర్ పొందే అవకాశం ఉంది.
Central Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో బంపర్ ఆఫర్ పొందే అవకాశం ఉంది. ఇప్పటికే హోలీ సందర్భంగా ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 34 శాతానికి పెరిగింది. తాజాగా ఇప్పుడు ఇతర అలవెన్సులు కూడా పెరగవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అలవెన్సులలో అతి ముఖ్యమైన అలవెన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇది త్వరలో పెరుగుతుందని చెబుతున్నారు.
మీడియా నివేదికల ప్రకారం.. ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్స్ (HRA) పెరగవచ్చు. దీని తరువాత ఉద్యోగుల జీతంలో మళ్లీ పెరుగుదల ఉంటుంది. నివేదికల ప్రకారం.. HRAలో 3 శాతం పెంచవచ్చని అంటున్నారు. అంటే గరిష్ట హెచ్‌ఆర్‌ఏ 27 శాతం నుంచి 30 శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయి. X, Y, Z తరగతి నగరాల ప్రకారం.. ఎక్స్ కేటగిరీలో ఉన్న కేంద్ర ఉద్యోగులు 27 శాతం హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నారు. Y కేటగిరీ ఉద్యోగుల HRA 18 శాతం నుంచి 20 శాతానికి ఉంటుంది. Z తరగతి HRA 9 శాతం నుంచి 10 శాతానికి పెరుగుతుంది.
డీఏ 25% దాటడంతో గతేడాది జూలైలో హెచ్‌ఆర్‌ఏ సవరించారు. జూలై 2021లో ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను 28 శాతానికి పెంచింది. డీఏ 25 శాతం దాటిన వెంటనే HRA కూడా సవరించారు. ఇప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతానికి పెరిగింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే HRA కూడా ఎప్పుడు సవరణ చేస్తారు అనేది ఉద్యోగులు వేచి చూస్తున్నారు.