EPFO: కంపెనీ మూసివేస్తే ఆగిపోయిన పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఎలా విత్‌ డ్రా చేయాలి..?

EPFO: ఉద్యోగుల భవిష్యత్ నిధి (EPFO) ఎంప్లాయిస్ రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పిస్తుంది. నెల నెల పెన్షన్ మంజూరు చేస్తుంది.

Update: 2022-01-27 07:48 GMT

EPFO: కంపెనీ మూసివేస్తే ఆగిపోయిన పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఎలా విత్‌ డ్రా చేయాలి..?

EPFO: ఉద్యోగుల భవిష్యత్ నిధి (EPFO) ఎంప్లాయిస్ రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పిస్తుంది. నెల నెల పెన్షన్ మంజూరు చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఈపీఎఫ్వోలో చేరాలి. దీని ద్వారా ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఒక ఉద్యోగి చాలా సంవత్సరాలు ఖాళీగా ఉన్నా, లేదంటే అతడు పనిచేసే కంపెనీ మూసివేసినా అతడి పీఎఫ్ ఖాతా నిష్క్రియాత్మకంగా మారుతుంది. దీనినే ఇంగ్లీషులో ఇనపరేటివ్ అకౌంట్ అంటారు. అలాంటి సమయంలో అందులో ఉన్నడబ్బులను ఎలా విత్ డ్రా చేయాలో తెలుసుకుందాం.

వాస్తవానికి ఇనపరేటివ్ అకౌంట్ ఉద్యోగంలో చేరిన వెంటనే మళ్లీ యాక్టివేట్ అవుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా మూసివేయడం సాధ్యం కాదు. కానీ కంపెనీ మూసివేసినట్లయితే ఈ ఖాతా కూడా మూసివేస్తారు. ప్రజలు నిష్క్రియ PF ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేయడానికి EPFO ఒక ప్రత్యేక పద్ధతిని సూచించింది. EPFO నిబంధనల ప్రకారం.. 3 సంవత్సరాల పాటు PF ఖాతాలో డబ్బు జమ చేయకపోతే ఆ ఖాతా పని చేయని మోడ్లోకి వెళ్లిపోతుంది. అటువంటి ఖాతాపై 3 సంవత్సరాల వరకు వడ్డీ లభిస్తుంది. తర్వాత EPFO ఆ ఖాతాలో వడ్డీని చెల్లించదు. ఈ పరిస్థితిలో ఈ డబ్బును ఉపసంహరించుకోవడం మంచిది. ఖాతాదారుడు 3 సంవత్సరాలలోపు మరణించినా అందులో జమ చేసిన డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు.

ఇలా చేయాలి..

1. ముందుగా http://103.194.45.139/INOPHelpDesk/jsp/submitDescription.jspకి వెళ్లి, మీ పని చేయని ఖాతాకు సంబంధించిన సమస్యను నమోదు చేయండి

2. తర్వాత నెక్స్ట్పై క్లిక్ చేసి కంపెనీ గురించి సమాచారాన్ని ఇవ్వండి. కంపెనీ కోడ్, PF ఖాతా సంఖ్య, కంపెనీ పేరు, కంపెనీ చిరునామా, కంపెనీ వివరాలు, రాష్ట్రం, జిల్లా, పిన్కోడ్, చేరడం & నిష్క్రమించే తేదీ, PF ఆఫీస్ పేరు

3. తర్వాతి పేజీలో KYC వివరాలతో సహా మీ అన్ని వ్యక్తిగత వివరాలను తెలియజేయండి.

4. తర్వాత మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సూచన సంఖ్యను భద్రంగా ఉంచండి.

Tags:    

Similar News