RBI: ఆర్బీఐ కొత్త నిబంధనలు.. అక్టోబర్‌ నుంచి అమలు..!

RBI: బ్యాంకు ఖాతాదారులని ఆర్థిక మోసాల నుంచి రక్షించడానికి ఆర్బీఐ కొత్త నిబంధనలను రూపొందించింది.

Update: 2022-09-03 13:30 GMT

RBI: ఆర్బీఐ కొత్త నిబంధనలు.. అక్టోబర్‌ నుంచి అమలు..!

RBI: బ్యాంకు ఖాతాదారులని ఆర్థిక మోసాల నుంచి రక్షించడానికి ఆర్బీఐ కొత్త నిబంధనలను రూపొందించింది. క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను సురక్షితంగా ఉంచేందుకు కార్డు టోకనైజేషన్ చేస్తుంది. ఈ నియమం ప్రకారం కార్డ్ హోల్డర్లు తమ కార్డును టోకెన్‌గా మార్చుకోవాలి. ఇప్పుడు వ్యాపారి, చెల్లింపు గేట్‌వే కంపెనీ కార్డ్ చెల్లింపు సమయంలో మీ డేటా, కార్డ్ వివరాలు సేవ్ చేయలేరు. బదులుగా వారు టోకెన్ వివరాలను సేవ్ చేస్తారు. అయితే వాటిని మీరే సృష్టించుకుంటారు. దీనికి సంబంధించిన తేదీని ఆర్బీఐ ఖరారు చేసింది. ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్ ప్రకారం ఈ నిబంధన అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది.

మీరు కార్డ్ ద్వారా చెల్లిస్తే మీ కార్డ్ వివరాలను టోకెన్‌తో భర్తీ చేయాలి. ఈ నియమాన్ని అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ముందుగా కార్డ్ టోకనైజేషన్ విధానాన్ని అర్థం చేసుకుందాం. మీరు ఎక్కడైనా కార్డ్ చెల్లింపులను ప్రాసెస్ చేసినప్పుడు ఆ వ్యాపారి ప్లాట్‌ఫారమ్ మీ కార్డ్ నంబర్, మీ CVV, గడువు తేదీ మొదలైన కార్డ్ వివరాలను సులభంగా, వేగవంతమైన చెల్లింపు అనుభవం కోసం డేటాబేస్‌లో స్టోర్‌ చేస్తుంది. ఇది ఇప్పటి వరకు జరిగే పద్దతి. కానీ భద్రత పరంగా ఇది సురక్షితమైన పద్ధతి కాదు. ఆ వెబ్‌సైట్ / ప్లాట్‌ఫారమ్ / వ్యాపారి డేటా హ్యాక్ చేస్తే మీ డేటా కూడా లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

అందుకే కార్డ్ టోకనైజేషన్ ఆప్షన్‌ను ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది. ఈ నియమం ప్రకారం.. మీరు కార్డ్ చెల్లింపు చేసినప్పుడు టోకెన్‌ను రూపొందించాలి. అప్పుడు వ్యాపారి మీ కార్డ్ వివరాలను సేవ్ చేయలేరు. టోకెన్ వివరాలు మాత్రమే వ్యాపారికి వెళ్తాయి. RBI నియమం ప్రకారం.. అక్టోబర్ 1, 2022 తర్వాత కార్డ్ హోల్డర్ల కార్డ్ వివరాలను బ్యాంక్ లేదా కార్డ్ జారీ చేసే సంస్థ/నెట్‌వర్క్ తప్ప మరెవరూ సేవ్ చేయలేరు. దీనికి ముందు వినియోగదారులు టోకెన్‌తో కార్డ్ వివరాలను భర్తీ చేయాలి. అంటే మీ కార్డును సురక్షితంగా ఉంచే బాధ్యత బ్యాంకులు, కార్డుదారులపైనే ఉంటుంది.

Tags:    

Similar News