Savings: నెల జీతంలో 30 శాతం పొదుపు చేస్తే భవిష్యత్తు బంగారమే...!

How To Save Salary: లక్షల జీతం సంపాదిస్తూ మంత్‌ ఎండింగ్‌ వస్తే చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితులను నేటి ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు.

Update: 2024-05-22 10:42 GMT

Savings: నెల జీతంలో 30 శాతం పొదుపు చేస్తే భవిష్యత్తు బంగారమే...!

How To Save Salary: లక్షల జీతం సంపాదిస్తూ మంత్‌ ఎండింగ్‌ వస్తే చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితులను నేటి ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ లేకపోవడమే. వచ్చిన సాలరీని వచ్చినట్లు ఖర్చు చేసుకుంటూ పోవడం వల్ల చివరకు ఒక్క రూపాయి మిగలదు. దీంతో సాలరీ రాకముందే దానికి సమానమైన అప్పులు చేస్తూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. కానీ ఆర్థిక నిపుణులు నెలవారీ జీతం తీసుకునేవారు అందులో కనీసం 30 శాతం సేవ్‌ చేయాలని చెబుతున్నారు. అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం.

జీతం వచ్చింది వచ్చినట్లు ఖర్చు చేయడమే మనం చేసే పెద్ద తప్పు. బదులుగా మొదట పొదుపు కోసం 30 శాతం కేటాయించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ 30 శాతం పొదుపును పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, మ్యూచువల్ ఫండ్ వంటివాటిలో ఇన్వెస్ట్‌ చేయాలి. అయితే ఈ 30 శాతం పొదుపును మీరు ఒక ప్రాజెక్ట్‌లో కాకుండా విభిన్న పద్ధతిలో పెట్టుబడి పెట్టినప్పుడు మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కుటుంబాన్ని పోషించే వారైతే చాలామంది నెలకు 4 సార్లు సినిమాలకు వెళ్లే అలవాటు ఉంటుంది. దీన్ని నెలకు ఒకసారి తగ్గించడానికి ప్రయత్నించండి. మీకు ఎక్కువ డబ్బు ఉంటే, మీరు వెళ్లవచ్చు. కానీ నెలకు చిన్న మొత్తాన్ని పొదుపు చేయాలనుకునే వారికి ఈ ఆప్షన్‌ బాగా సెట్‌ అవుతుంది. నెలలో కొన్ని రోజులు ఎంచుకొని ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఉండండి. దీనిని “నో స్పెండింగ్ డే” అంటారు. దీనివల్ల చిన్నమొత్తం ఆదా అవుతూ అత్యవసర ఖర్చులకు ఉపయోగపడుతుంది.

ప్రతి వ్యక్తి నీడ్, వాంట్‌ ని గ్రహించి డబ్బులు ఖర్చు చేయాలి. మీ అవసరం ఏమిటీ.. మీకు ఏం కావాలి తెలిస్తే చాలా డబ్బు ఆదా అవుతుంది. ఉదాహరణకు మీరు ఆకలితో ఉన్నారని అనుకుంటే ఆ సమయంలో కావలసినది కాస్త ఆహారం. అయితే ఆ సమయంలో మీరు బిర్యానీ తింటే అది మీ ఇష్టం. కానీ ఆకలి అనేది సాధారణ అన్నం తిన్నా బిర్యానీ తిన్నా తీరుతుంది. ఈ సత్యం గ్రహించినవారు చాలా పొదుపు చేస్తారు.

Tags:    

Similar News