Post Office: రూ. 5 లక్షల పెట్టుబడి పెడితే.. రూ. 15 లక్షలు పొందొచ్చు..!

పోస్టాఫీస్‌ అందిస్తున్న ఇలాంటి బెస్ట్ స్కీమ్స్‌లో టైమ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెడితే బ్యాంక్‌ ఎఫ్‌డీ కంటే మంచి రిటర్న్స్‌ పొందొచ్చు.

Update: 2024-08-23 06:00 GMT

Post Office: రూ. 5 లక్షల పెట్టుబడి పెడితే.. రూ. 15 లక్షలు పొందొచ్చు..!

Post Office Time Deposit Scheme: సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. వారి వారి ఆర్థిక వనరులకు అనుగుణంగా పొదుపు చేస్తుంటారు. ఇందుకోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే కష్టపడి సంపాదించిన సొమ్ముకు సెక్యూరిటీతో పాటు మంచి రిటర్న్స్‌ రావాలని కోరుకుంటాం. అలాంటి వారి కోసం ప్రభుత్వ రంగ సంస్థలు మంచి స్కీమ్స్‌ను అమలు చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో పోస్టాఫీస్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

పోస్టాఫీస్‌ అందిస్తున్న ఇలాంటి బెస్ట్ స్కీమ్స్‌లో టైమ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెడితే బ్యాంక్‌ ఎఫ్‌డీ కంటే మంచి రిటర్న్స్‌ పొందొచ్చు. ఈ పథకంలో రూ. 5 లక్షల పెట్టుబడి పెడితే రూ. 15 లక్షల రిటర్న్స్‌ పొందొచ్చు. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం అంటే ఏంటి.? ఇందులో ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదాహరణకు మీరు ఈ పథకంలో మొదట రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారనుంకుందాం. ఈ పెట్టుబడి మొత్తంపై 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. అంటే ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.7,24,974 అవుతుంది. ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేయకుండా మరో ఐదేళ్లు పొడిగిస్తే.. పదేళ్లల్లో 5 లక్షల మొత్తంపై వడ్డీ ద్వారా రూ. 5,51,175 సంపాదిస్తారు. అంటే మీ మొత్తం రూ. 10,51,175 అవుతుంది. అనంతరం 5 సంవత్సరాలకు చేయాలంటే రాబడిని రెండు భాగాలు విభజించి మళ్లీ డిపాజిట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 5 లక్షలపై వడ్డీ నుండి మాత్రమే రూ.10,24,149 పొందవచ్చు. ఈ విధంగా మీరు పెట్టుబడి పెట్టిన 5 లక్షలు, 10,24,149 రూపాయలను కలపడం ద్వారా మీరు మొత్తం 15,24,149 రూపాయలు పొందవచ్చు.

ఈ పథకంలో పెట్టుబడిని కేవలం రెండుసార్లు మాత్రమే పొడగించుకునే అవకాశం ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులలో కూడా మీరు వివిధ పదవీకాల ఎఫ్‌డీల ఎంపికను పొందవచ్చు. వ్యవధి ఆధారంగా వేర్వేరు వడ్డీ రేట్లు ఇస్తారు. ఒక సంవత్సరం డిపాజిట్‌పై 6.9 శాతం, రెండు సంవత్సరాల ఎఫ్‌డీపై 7.0 శాతం వార్షిక వడ్డీ, మూడు సంవత్సరాల ఎఫ్‌డీపై 7.1 శాతం వార్షిక వడ్డీ, ఐదు సంవత్సరాల టీడీపై 7.5 శాతం వార్షిక వడ్డీ పొందొచ్చు. మీరు ఎన్నేళ్లు డిపాజిట్ చేస్తారన్న దానిబట్టి మీకు వచ్చే వడ్డీ ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News