జన్‌ధన్‌ బ్యాంక్‌ ఖాతాని సేవింగ్స్‌ ఖాతాగా మార్చుకోవడం ఎలా..?

Jandhan Bank Account: కస్టమర్లు అడిగే అన్ని ప్రశ్నలకు ట్వీట్ చేయడం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాధానం ఇస్తుంది...

Update: 2021-11-19 11:00 GMT

జన్‌ధన్‌ బ్యాంక్‌ ఖాతాని సేవింగ్స్‌ ఖాతాగా మార్చుకోవడం ఎలా..?

Jandhan Bank Account: దేశంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ అకౌంట్ ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్‌ బ్యాంక్‌ ఖాతాలని ప్రారంభించింది. ఈ ఖాతా ఓపెన్ చేయడానికి బ్యాంకులు ఎటువంటి రుసుము వసూలు చేయవు. అంతేకాదు ఇది జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, సబ్సిడీలు పొందడానికి ఈ ఖాతాలు ఉపయోగపడుతాయి.

అయితే కొంతమంది జన్ ధన్ బ్యాంక్ ఖాతాని సేవింగ్స్ ఖాతాగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే జన్ ధన్ ఖాతాకి బ్యాంకు అన్ని సౌకర్యాలను అందించదు. కాబట్టి ఖాతాదారులు ఈ ఖాతాలను పొదుపు ఖాతాగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుడు SBIని ట్విట్టర్‌ ద్వారా ఓ ప్రశ్న అడిగాడు. అదేంటంటే జన్ ధన్ బ్యాంక్ ఖాతాని సేవింగ్స్ ఖాతాగా ఎలా మార్చుకోవచ్చని అడిగాడు. దీనికి ఎస్బీఐ స్పందించింది. జన్‌ధన్‌ అకౌంట్‌ని ఏ విధంగా పొదుపు ఖాతాగా మార్చుకోవాలో చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం.. జన్ ధన్ బ్యాంక్ ఖాతాని సేవింగ్స్ ఖాతాగా మార్చడానికి ముందుగా బ్యాంక్ హోమ్ బ్రాంచ్‌కి వెళ్లాలి. మీరు బ్యాంకులో ఖాతా మార్పిడి కోసం దరఖాస్తును సమర్పించాలి.

దీంతో పాటు మీరు KYC పత్రాలను బ్యాంకుకు సమర్పించాలి. అయితే ఈ మొత్తం ప్రక్రియ కోసం మీకు ఏ పత్రాలు అవసరమో తెలుసుకోవాలంటే SBI వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియను అనుసరించడం ద్వారా మీరు మీ జన్ ధన్ బ్యాంక్ ఖాతాను సులభంగా సేవింగ్స్ ఖాతాగా మార్చుకోవచ్చు. కస్టమర్లు అడిగే అన్ని ప్రశ్నలకు ట్వీట్ చేయడం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాధానం ఇస్తుంది. దీంతో కస్టమర్ల సమస్యలు సులభంగా పరిష్కారమవుతున్నాయి.

Tags:    

Similar News