Investment Tips:18 ఏళ్లలోపు పిల్లలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి.. చిన్న పొదుపు పెద్ద ప్రభావం..!
Investment Tips: పిల్లలు చిన్న వయసులోనే పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో తొందరగా స్థిరపడుతారు. అంతేకాకుండా ఆర్థిక విషయాలపై పట్టు సాధిస్తారు.
Investment Tips: పిల్లలు చిన్న వయసులోనే పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో తొందరగా స్థిరపడుతారు. అంతేకాకుండా ఆర్థిక విషయాలపై పట్టు సాధిస్తారు. ఎవరి జీవితంలోనైనా ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పుడో ఒక సమయంలో ప్రారంభం కావాల్సిందే. ఈ ప్రయాణం ఎంత త్వరగా ప్రారంభమైతే దీర్ఘకాలంలో అంత ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. తల్లిదండ్రులు తన బిడ్డ లేదా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయాడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి పిల్లలకు సురక్షితమైనవి దాని నుంచి వచ్చే రాబడి అధికంగా ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.
లైఫ్ ఇన్సూరెన్స్
జీవిత బీమా మంచి పెట్టుబడిగా చెబుతారు. చిన్న వయస్సులోనే ఇన్సూరెన్స్ తీసుకుంటే అధిక రాబడిని పొందవచ్చు. ఇది కాకుండా ప్రీమియం కూడా తగ్గుతుంది. అదే సమయంలో రాబడులు పెరుగుతాయి. అంతేకాకుండా జీవిత బీమా ద్వారా పిల్లల జీవితాన్ని కవర్ చేయవచ్చు.
ఎఫ్ డి
పిల్లలు బ్యాంకులో FD చేయవచ్చు. FD సురక్షితమైన పెట్టుబడిగా చెబుతారు. పిల్లలు కోరుకుంటే దీర్ఘకాలిక FDని చేయవచ్చు. దానిపై మంచి వడ్డీని పొందవచ్చు. అంతేకాకుండా వారి కోరిక మేరకు సమయాన్ని ఎంచుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
RD
పిల్లలు తమ డబ్బును ఆదా చేసుకోవడానికి పిగ్గీ బ్యాంకులను ఉపయోగిస్తారు. పిల్లలకు ఏ డబ్బు వచ్చినా తమ పిగ్గీ బ్యాంకులో పొదుపు చేస్తారు. పిల్లలు ఆ డబ్బును పిగ్గీ బ్యాంకులో సేవ్ చేయకుండా ప్రతి నెలా RD ఖాతాలో సేవ్ చేయవచ్చు. RD లో డబ్బు ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రజలు దానిపై వడ్డీని అధికంగా పొందుతారు.