Honda Activa: హోండా యాక్టివా 125 కొనాలనుకుంటున్నారా.. ఈ సరికొత్త ఆఫర్ తెలిస్తే..!
Honda Activa: హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా కంపెనీ యాక్టివా 125 స్కూటర్‌పై ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందించింది.
Honda Activa: హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా కంపెనీ యాక్టివా 125 స్కూటర్‌పై ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందించింది. ఇందులో స్కూటర్ కొనుగోలుపై కస్టమర్లు రూ.5000 వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఎంచుకున్న డెబిట్ కార్డ్‌ల ద్వారా EMIలో స్కూటర్ కొనుగోలుపై కస్టమర్లు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందుతారు. కనీసం రూ. 30,000 లావాదేవీలపై కంపెనీ ౫ శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తుంది. అంటే రూ.5,000 వరకు అని అర్థం.
ఈ ఆఫర్ 31 మార్చి 2022 వరకు ఇది కాకుండా, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా వినియోగదారులకు యాక్టివా 125 స్కూటర్‌ను రూ. 3,999 ప్రారంభ డౌన్‌పేమెంట్‌తో అందిస్తోంది. అలాగే కంపెనీ ఈ ఆఫర్‌ను కస్టమర్లకు 31 మార్చి 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంచింది. డీలర్షిప్, నగరాన్ని బట్టి ఈ ఆఫర్లు మారవచ్చు. కాబట్టి ఉత్తమమైన డీల్ కోసం కస్టమర్లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. 125 కాకుండా హోండా ఈ ఆఫర్‌ను Activa 6Gలో కూడా అందుబాటులోకి తెచ్చింది.
భారతీయ కస్టమర్లలో హోండా యాక్టివా 125 ఎంతగా నచ్చుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ స్కూటర్ చాలా కాలంగా కంపెనీలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా నిలిచింది. కంపెనీ గత నెలలో ఈ స్కూటర్ 1,43,234 యూనిట్లను భారతదేశంలో విక్రయించింది. హోండా యాక్టివా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 8.18 బిహెచ్పి పవర్, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 124 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది. భారతీయ మార్కెట్లో ఇది సుజుకి యాక్సెస్ 125, TVS జూపిటర్ 125 లకు పోటీగా ఉంది.