HDFC: వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ.. కానీ వారికి మాత్రమే లాభం..!
HDFC: వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ.. కానీ వారికి మాత్రమే లాభం..!
HDFC: ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంకుల తర్వాత ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు బహుమతిని అందించింది. హోలీకి ముందు వడ్డీ రేట్లని మార్చింది. గతంలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ వడ్డీరేట్లను పెంచి వినియోగదారులకు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. కొత్త రేట్లు మార్చి 1, 2022 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. కానీ కొంతమంది ప్రత్యేక వ్యక్తులు మాత్రమే ఈ రేట్ల ప్రయోజనాన్ని పొందుతారని గుర్తుంచుకోండి. హెచ్‌డిఎఫ్‌సి విత్‌డ్రా చేయలేని ఎఫ్‌డిల రేట్లను మార్చింది. కొత్త రేట్లు రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న FDలపై మాత్రమే వర్తిస్తాయి. భారతదేశంలో నివసిస్తున్న వినియోగదారులతో పాటు, NRO, NREలు కూడా దీని ప్రయోజనాన్ని పొందుతారు. కొత్త రేట్లలో ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దాం.
బ్యాంక్ ఇచ్చిన సమాచారంలో 5 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఎఫ్‌డిపై 4.7% వడ్డీ చెల్లిస్తారు. దీని పరిమితి 3 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ, 3 సంవత్సరాల కంటే తక్కువ FDలు 4.6% వడ్డీని పొందుతాయి. ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల లోపు పెట్టుబడిదారుడి FDపై 4.55 శాతం వడ్డీ లభిస్తుంది. 9 నెలలు లేదా అంతకంటే ఎక్కువ, ఒక సంవత్సరం కంటే తక్కువ FDలకు 4.15% వడ్డీ లభిస్తుంది. 5 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదు.
నాన్-విత్‌డ్రావల్ FD అంటే ఏమిటి?
సాధారణ FDలో మెచ్యూరిటీకి ముందే డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నాన్-విత్‌డ్రావల్ FDలలో సమయం పూర్తయ్యేలోపు ఉపసంహరించుకునే అవకాశం ఉందు. ఈ రకమైన FDని కస్టమర్ ముందుగా క్లోజ్ చేయలేరు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపు ఉంటుంది. కానీ ఆ పరిస్థితిలో బ్యాంకు అసలు మొత్తంపై ఎటువంటి వడ్డీని చెల్లించదు.