Mutual Funds: మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారా.. వీటిలో రాబడి, రిస్క్‌ ఏ విధంగా ఉంటుందంటే..?

Mutual Funds: నేటి టెక్నాలజీ యుగంలో బిజినెస్‌ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది.

Update: 2024-04-26 00:30 GMT

Mutual Funds: మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారా.. వీటిలో రాబడి, రిస్క్‌ ఏ విధంగా ఉంటుందంటే..?

Mutual Funds: నేటి టెక్నాలజీ యుగంలో బిజినెస్‌ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్‌ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. గతంలో చాలామంది డబ్బులు బ్యాంకు పొదుపు ఖాతా లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేవారు కానీ ఆధునిక కాలంలో అందరూ స్టాక్‌ మార్కెట్‌, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు అందరి ఆదాయాలు పెరిగాయి అంతేకాకుండా రిస్క్‌ తీసుకునే శక్తి పెరిగింది. దీంతో అధిక లాభాల కోసం అందరూ బిజినెస్‌ చేయడం ప్రారంభించారు. ఈ రోజు మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ ఎన్ని రకాలు ఉంటాయి. ఇందులో రాబడి, రిస్క్‌ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.

ఈక్విటీ ఫండ్‌లు: ఈక్విటీ ఫండ్స్‌ ప్రధానంగా కంపెనీల స్టాక్‌లు,షేర్లలో పెట్టుబడి పెడతాయి. ఇవి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి. ఈ ఫండ్స్ కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రాబడిని అందిస్తాయి కానీ అధిక రిస్క్‌ను కూడా కలిగి ఉంటాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ (లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్), పెట్టుబడి శైలి (విలువ, వృద్ధి) లేదా సెక్టార్ (బ్యాంకింగ్, టెక్నాలజీ మొదలైనవి) ఆధారంగా ఈక్విటీ ఫండ్‌లను వర్గీకరిస్తారు.

డెట్ ఫండ్‌లు: డెట్ ఫండ్‌లు ప్రాథమికంగా బాండ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ సాధనాల వంటి స్థిర-ఆదాయ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి. ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే సాధారణ ఆదాయాన్ని, తక్కువ రిస్క్ కోరుకునే పెట్టుబడిదారులకు ఇవి అనుకూలంగా ఉంటాయి.

హైబ్రిడ్ ఫండ్స్: వీటిని బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఈక్విటీ, డెట్ సాధనాల మిశ్రమంలో పెట్టుబడి పెడతాయి. తక్కువ రిస్క్‌తో తక్కువ రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు ఇవి సరిపోతాయి.

ఇండెక్స్ ఫండ్స్: ఈ ఫండ్స్‌ నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ వంటి నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్ పనితీరును ప్రతిబింబించే లక్ష్యంతో ఉంటాయి. ఇండెక్స్‌కు సమానమైన నిష్పత్తిలో అదే స్టాక్‌లలో పెట్టుబడి పెడతారు. ఇండెక్స్‌కు సమానమైన రాబడిని అందించాలని లక్ష్యంగా ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తారు.

ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్(ఈఎల్ఎస్ఎస్): ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ఈఎల్ఎస్ఎస్) ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. పన్ను మినహాయింపు కోరుకునే వారు ప్రధానంగా ఈక్విటీలో పెట్టుబడి పెడతారు. మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది.

లిక్విడ్ ఫండ్‌లు: లిక్విడ్ ఫండ్స్ 91 రోజుల వరకు మెచ్యూరిటీతో స్వల్పకాలిక మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెడుతాయి. ఇవి అధిక లిక్విడిటీని అందిస్తాయి. స్వల్పకాలంలో లాభాలు కోరుకునేవారికి అనుకూలంగా ఉంటాయి. రిస్క్‌ కూడా అదే రీతిలో ఉంటుంది.

గిల్ట్ ఫండ్స్: గిల్ట్ ఫండ్స్ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే వివిధ మెచ్యూరిటీల ప్రభుత్వ సెక్యూరిటీలలో (గిల్ట్స్) పెట్టుబడి పెడతాయి. వీరు తక్కువ క్రెడిట్ రిస్క్ కలిగి ఉంటాయి. కానీ వడ్డీ రేటు మార్పులకు సున్నితంగా ఉంటాయి. ఉదాహరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే రిటైల్ డైరెక్ట్ స్కీమ్ రిటైల్ పెట్టుబడిదారులను నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి, మధ్యవర్తుల అవసరాన్ని తొలగిస్తుంది. ఇవే కాక మరికొన్నిమ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ కూడా ఉంటాయి.

Tags:    

Similar News