Changed Job: ఉద్యోగం చేంజ్ అయ్యారా.. పీఎఫ్ అకౌంట్ గురించి ఈ విషయాలు తెలుసుకోపోతే నష్టపోతారు..!
Changed Job: ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు. జీతం పెరుగుదల, ఇతర కారణాల వల్ల ఇలా జరుగుతుంది.
Changed Job: ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు. జీతం పెరుగుదల, ఇతర కారణాల వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి సమయంలో చాలామంది పీఎఫ్ గురించి ఆందోళన చెందుతుంటారు. కొందరికి పాత పీఎఫ్ అకౌంట్‌ను కొత్త కంపెనీలోకి ఎలా మార్చుకోవాలో తెలియదు. కొత్త కంపెనీ వారు పీఎఫ్ నెంబర్ అడిగితే ఇవ్వాలా వద్దా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది. ఇలాంటి విషయాల గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.
యూఏఎన్ నంబర్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులు అందరికీ 12 అంకెల ప్రత్యేక నంబర్ కేటాయిస్తుంది. దీనినే యూఏఎన్ నంబర్ అంటారు. ఇది ఒక వ్యక్తికి పర్మనెంట్‌గా ఉంటుంది. మీరు ఉద్యోగాలు మారినా ఈ నెంబర్ మాత్రం మారదు. మీరు ఎన్ని కంపెనీలు మారితే అన్నీ పీఎఫ్ అకౌంట్స్ ఉంటాయి కానీ అవన్నీ ఈ నెంబర్ కిందే ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఒక ఉద్యోగికి వివిధ కారణాల వల్ల కొత్త యూఏఎన్ నంబర్ ను కేటాయించవచ్చు. అతడు తన నంబర్ ఐడీ, యూఏఎన్ నంబర్ ఇవ్వనప్పుడు మాత్రమే కొత్త నంబర్ ను కేటాయిస్తారు.
ఖాతాలను మెర్జ్ చేయాలి
ఒక ఉద్యోగి తన యూఏఎన్ నంబర్ లో ఉన్న వివిధ ఈపీఎఫ్ ఖాతాలను మెర్జ్ చేసుకోవాలి. ఉద్యోగ రీత్యా వివిధ కంపెనీలకు మారినప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కొత్త సంస్థలో చేరినప్పుడు ఈపీఎఫ్ ఖాతా తెరిచిన వెంటనే తన పాత యూఏఎన్ నంబర్ చెప్పాలి. అప్పుడే పాత ఖాతా నుంచి సొమ్ములు సులభంగా బదిలీ అవుతాయి. ఒక్కోసారి కొత్త సంస్థ కొత్త ఈపీఎఫ్ ఖాతాతో పాటు కొత్త యూఏఎన్ నంబర్ ను కేటాయిస్తుంది. అలాంటప్పుడు పాత యూఏఎన్ నంబర్‌ను దానిలో విలీనం చేసుకోవాలి.