Pan Card: పాన్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఇలా జరిగితే చిక్కుల్లో పడ్డట్లే.. గుర్తిస్తే వెంటనే అప్రమత్తవ్వాల్సిందే..!
Pan Card Download: దేశంలో ప్రజలు చాలా ఆర్థిక లావాదేవీలు చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీలు చేయడానికి ప్రజలకు పాన్ కార్డు అవసరం. భారతదేశంలోని ఆదాయపు పన్ను శాఖ ద్వారా పాన్ కార్డ్ జారీ చేస్తుంది. ఈ పాన్ కార్డ్‌లో నమోదు చేసిన సంఖ్య ప్రతి పౌరుడికి భిన్నంగా అందిస్తుంది.
Pan Card Update: దేశంలో ప్రజలు చాలా ఆర్థిక లావాదేవీలు చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీలు చేయడానికి ప్రజలకు పాన్ కార్డు అవసరం. భారతదేశంలోని ఆదాయపు పన్ను శాఖ ద్వారా పాన్ కార్డ్ జారీ చేస్తుంది. ఈ పాన్ కార్డ్‌లో నమోదు చేసిన సంఖ్య ప్రతి పౌరుడికి భిన్నంగా అందిస్తుంది. అదే సమయంలో, ముఖ్యమైన పనుల కోసం, పాన్ కార్డు ఫోటో కాపీని కూడా అందివ్వాల్సి ఉంటుంది. అయితే, మీ పాన్ కార్డ్ మోసానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా. ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా మీ పాన్ కార్డును ఉపయోగిస్తే, దాన్ని ఎలా తనిఖీ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
జాగ్రత్తలు తీసుకోకుంటే భారీ నష్టం..
మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతుందని మీరు భావిస్తే, మీరు కీలక విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు మీ ఆర్థిక నివేదికలను నిరంతరం తనిఖీ చేయాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్, బిల్లులు మొదలైనవాటిని తనిఖీ చేయాలి. ఎటువంటి తప్పుడు లావాదేవీ జరగలేదని గుర్తించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రతి బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను జాగ్రత్తగా తనిఖీ చేయాలి.
ఇది కాకుండా, మీ CIBIL స్కోర్‌ను కూడా తనిఖీ చేస్తూ ఉండండి. CIBIL స్కోర్‌లో మీ ద్వారా తీసుకున్న లోన్-క్రెడిట్ కార్డ్ మొదలైన వాటి గురించి సమాచారం కూడా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, మీ పాన్‌పై ఎవరికీ ఎటువంటి రుణం లేదా క్రెడిట్ కార్డ్ జారీ చేయలేదని తెలుసుకోవాలి. ఇది కాకుండా మీ ఆదాయపు పన్ను ఖాతాను కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది.
మోసం జరిగితే ఫిర్యాదు చేయండలా..
ఈ సమయంలో మీకు ఏదైనా తప్పుడు లావాదేవీలు గుర్తిస్తే.. ముందుగా మీ బ్యాంకుకు వెంటనే తెలియజేయాలి. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మోసం జరిగితే, పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తే చాలా మంచింది. ఇది కాకుండా, ఆదాయపు పన్ను శాఖకు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఫిర్యాదును నమోదు చేసిన తర్వాత, వాళ్లు తగిన చర్యలు తీసకుంటారు.