Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌కి పెరుగుతున్న క్రేజ్.. ఈ లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌కి పెరుగుతున్న క్రేజ్.. ఈ లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Mutual Fund: నేటి కాలంలో పెట్టుబడిదారులు మ్యూచ్‌వల్ ఫండ్స్‌వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. జూన్ లెక్కలు తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. జూన్ త్రైమాసికంలో దాదాపు 51 లక్షల మంది ఇన్వెస్టర్లు మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించారు. దీనికి కారణం వీటిపై పెరుగుతున్న అవగాహనే. నేటి కాలంలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇది ఉత్తమ ఎంపికగా కనిపిస్తోంది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 51 లక్షల ఇన్వెస్టర్లు ఖాతాలు తెరిచారు. దీంతో మొత్తం సంఖ్య 13.46 కోట్లకు పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్‌పై విస్తృత అవగాహన, డిజిటలైజేషన్ ద్వారా పెట్టుబడి దారులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీల సంఘం అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) డేటా ప్రకారం.. మార్చి త్రైమాసికంలో 93 లక్షల ఖాతాలు ఓపెన్ అయ్యాయి.
గత 12 నెలల్లో 3.2 కోట్ల ఖాతాలు తెరిచారు. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో ఖాతాల సంఖ్య పెరుగుదల తక్కువగా ఉన్నప్పటికీ ఊహించిన దానికంటే ఎక్కువే అని చెప్పవచ్చు. మార్కెట్‌లో అస్థిరత ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం కొనసాగించండి అందరిని ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లని పెంచడంతో చాలామంది మ్యూచ్‌వల్‌ఫండ్స్ వైపు మొగ్గుచూపుతున్నారు.