ఆధార్ కార్డుతో ప్రభుత్వ రుణం.. వారికి మాత్రమే..!

Pradhan Mantri Swanidhi Yojana: వీధి వ్యాపారులకి సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకాన్నిఅమలు చేస్తోంది.

Update: 2022-08-22 11:30 GMT

ఆధార్ కార్డుతో ప్రభుత్వ రుణం.. వారికి మాత్రమే..!

Pradhan Mantri Swanidhi Yojana: వీధి వ్యాపారులకి సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకాన్నిఅమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వం సులభ నిబంధనలపై రూ.10,000 రుణం అందిస్తోంది. ఇప్పటి వరకు 30 లక్షల మందికి పైగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు ఈ పథకం కింద ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తోంది.

ఆధార్ కార్డుతో రుణం

మీరు ఈ పథకం కింద రుణం తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్‌లో పీఎం స్వనిధి యోజన ఫారమ్‌ను పూరించాలి. దరఖాస్తు ఫారమ్‌తో పాటు ఆధార్ కార్డు ఫోటోకాపీని అందించాలి. తర్వాత బ్యాంక్ మీ దరఖాస్తును ఆమోదిస్తుంది. రుణం మంజూరైన తర్వాత పథకం మొదటి విడత మీ ఖాతాలో జమ అవుతుంది.

హామీ అవసరం లేదు

ఈ పథకం కింద రుణం తీసుకోవడానికి బ్యాంకుకు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దరఖాస్తును ఆమోదించిన తర్వాత బ్యాంకు రుణ మొత్తాన్ని మీ ఖాతాకు బదిలీ చేస్తుంది. ఈ పథకం కింద తీసుకున్న రుణాన్ని ఒక సంవత్సరం వ్యవధిలో తిరిగి చెల్లించాలి. దీని కోసం బ్యాంకు నెలవారీ వాయిదాలు వసూలు చేస్తుంది.

1 లక్ష వరకు రుణం

మీరు ఈ పథకం కింద తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే రెండో సారి ఈ పథకం కింద రూ.20,000 రుణాన్ని పొందవచ్చు. అదే సమయంలో 20 వేల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం మీకు మూడవసారి రూ.50,000 వరకు, నాల్గవసారి రూ.లక్ష వరకు రుణాన్ని ఇస్తుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి

మీరు ఈ పథకం కింద లోన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మీరు PM Svanidhi Yojana http://pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి . అక్కడ అప్లై లోన్ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేసి క్యాప్చాపై క్లిక్ చేయాలి. OTPని ఎంటర్‌ చేసిన తర్వాత మొబైల్ నంబర్ ధృవీకరిస్తుంది. తర్వాత దరఖాస్తు ఫారమ్ ఓపెన్‌అవుతుంది. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి ఫారమ్ సమర్పిస్తే సరిపోతుంది.

Tags:    

Similar News