గూగుల్ మీట్ ఇక నుంచి భారమే!

Google Meet's Free Features : లాక్ డౌన్ సమయంలో అందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఉద్యోగులకి, విద్యార్ధులకి చాలా చేరువైంది వీడియో చాట్ ప్లాట్‌ఫామ్ గూగుల్ మీట్.. ఇందులోనే తమ వ్యాపారానికి సంబంధించిన విషయాలను, ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తూ వచ్చారు

Update: 2020-09-28 08:45 GMT

Google Meet's Free Features : లాక్ డౌన్ సమయంలో అందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఉద్యోగులకి, విద్యార్ధులకి చాలా చేరువైంది వీడియో చాట్ ప్లాట్‌ఫామ్ గూగుల్ మీట్.. ఇందులోనే తమ వ్యాపారానికి సంబంధించిన విషయాలను, ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తూ వచ్చారు. దీంతో ఈ యాప్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు గూగుల్ మే నెలలో ప్రకటించింది. అయితే తాజాగా ఈ నెల 30 నుంచి ఉచిత సేవలను నిలిపివేయనున్నట్లుగా గూగుల్ మీట్ ప్రకటించింది. ఈ మేరకు మీట్‌లో ఎలాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌ అందుబాటులోకి తీసుకురావట్లేదని వెల్లడించింది.

అయితే నిలిపివేయడానికి కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.. దీని వల్ల యూజర్స్ ఒక మీట్ కాల్‌ను కేవలం 60 నిమిషాలు మాత్రమే మాట్లాడగలరు. అపరిమిత కాల్స్ చేసుకునే వీలు ఉండదు. ఈ మేరకు గూగుల్ ప్రతినిధి ఒకరు ఈమెయిల్‌లో మాట్లాడుతూ, " గూగుల్ మీట్ లేటెస్ట్ ఫీచర్స్ లో ఎలాంటి మార్పులు లేవు. ఒకవేళ అలాంటి మార్పులు ఉంటే మేము మీకు తెలియజేస్తాము" అని రాసుకొచ్చారు.

గూగుల్ మీట్ లో 250 మందితో మీటింగ్స్, ఒకే డొమైన్‌లో 100,000 మంది వరకు లైవ్ స్త్రీమ్, మీటింగ్ రికార్డి చేసి గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసే ఫీచర్స్ ప్రస్తుతం అందిస్తుంది. ఆ ఫీచర్స్ సాధారణంగా జి‌ సూట్ "ఎంటర్ప్రైజ్" కస్టమర్లకు మాత్రమే లభిస్తాయి, దీని ధర నెలకు 25 (సుమారు రూ. 1,800)డాలర్లు. గూగుల్ ఖాతా ఉన్న ఎవరైనా కాలపరిమితి లేకుండా 100 మందితో ఉచిత సమావేశాలను నిర్వహించుకోవచ్చు.

ఇక గతంలో గూగుల్‌ డ్యూయో, మీట్‌ కలిసిపోనున్నాయనే వార్తలు కూడా వచ్చాయి.. ఈ రెండు కూడా ఒకే తరహామైన సేవలను అందిస్తుడటంతో వాటిని కలిపివేయాలని గూగుల్ భావించింది. వివిధ కారణాలతో దీనిని వాయిదా వేశారు. 

Tags:    

Similar News