Google Maps: నిండు ప్రాణం తీసిన గూగుల్ తల్లి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి..

గూగుల్ మ్యాప్స్ ని ఫాలో అవుతూ దారి తప్పిన ఓ టెక్కీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి స్వస్థలం కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెం గ్రామం. వీకెండ్ లో విహరిద్దామనుకున్న స్నేహితుల బృందం ప్రమాద ఘటనతో విషాదంలో మునిగిపోయింది.

Update: 2023-05-17 10:35 GMT

Google Maps: నిండు ప్రాణం తీసిన గూగుల్ తల్లి

Google Maps: ఎవరైనా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు వారు వెళ్లాల్సిన గమ్యస్థానాలకు చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తున్నారు. తెలియని ప్రదేశానికి వెళ్లాలన్నా సరే..ఎలాంటి భయం లేకుండా గూగుల్ తల్లి ఉందిగా అంటూ ధైర్యంగా ప్రమాణం సాగించేస్తున్నాం. అయితే గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని తప్పులో కాలేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గూగుల్ మ్యాప్స్ ను అనుసరించి దారి తప్పడమో..ప్రమాదాల బారిన పడడం రివాజుగా మారింది. తాజాగా హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెం గ్రామానికి చెందిన చరణ్ హైదరాబాద్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. వీకెండ్ కావడంతో తన స్నేహితులతో కలిసి సిటీ చూద్దామని బైక్స్ పై బయల్దేరారు. ఈ క్రమంలోనే ఇద్దరు స్నేహితులను చరణ్ తన బైక్ పై ఎక్కించుకున్నాడు. ఫ్రెండ్స్ బృందం తొలుత నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం చూశాక ట్యాంక్ బండ్ పై సేద తీరారు. అనంతరం వీరు గూగుల్ మ్యాప్స్ సాయంతో మెహదీపట్నం నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపు ప్రయాణం సాగించారు.

గూగుల్ మ్యాప్స్ ని ఫాలో అవుతూ గచ్చిబౌలి వెళ్తుండగా తప్పుడు మార్గంలో వెళ్తున్నట్లు చరణ్ గుర్తించాడు. దీంతో మెహిదీపట్నం-శంషాబాద్ ఎక్స్ ప్రెస్ మార్గంలో పిల్లర్ నంబర్ 84వద్ద ఎక్స్ ప్రెస్ వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు మలుపు తిరిగాడు. ఈ క్రమంలోనే ఆరాంఘర్ వైపు నుంచి వస్తున్న కారు చరణ్ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు గాయాలు అయ్యాయి. చరణ్ కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచాడు. ఈ ప్రమాద ఘటన నుంచి మిగిలిన ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

Tags:    

Similar News