Google Layoffs: గూగుల్‌కు గడ్డు కాలం.. మరిన్ని తొలగింపులు..
Google Layoffs: ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు సైతం గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
Google Layoffs: ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు సైతం గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించడం అనివార్యమవుతోంది. ఇప్పటికే టెక్ దిగ్గజం గూగుల్ 12 వేల మందిని జనవరిలో ఇంటికి పంపింది. అయినా, పరిస్థితులు చక్కబడకపోవడంతో మరింత మంది ఉద్యోగులను తీసివేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ దిశగా సంకేతాలిచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా పిచాయ్ మాట్లాడుతూ.. గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ బార్డ్, జీమెయిల్, గూగుల్ డాక్స్, ఇతర ప్రాజెక్ట్‌ల సామర్ధ్యాలు, అవకాశాలపై దృష్టి పెడుతున్నామని సీఈఓ చెప్పారు.
ప్రస్తుతానికి కంపెనీ దృష్టంతా ఆపరేషన్స్‌పైనే ఉందని, పనులు వేగవంతంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రియారిటీ ఆధారంగా పనులు పూర్తి చేస్తున్నట్టు వివరించారు. ఈ సమయంలోనే లేఆఫ్‌లు కూడా ఉండొచ్చు అని సంకేతాలిచ్చారు. ప్రస్తుతం కన్నా 20% సమర్థంగా పని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు. రోజురోజుకీ పనులు వేగం పుంజుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పారు. ఖర్చులను కూడా అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సుందర్ పిచాయ్ ప్రకటనతో గూగుల్ ఉద్యోగుల్లో మరోసారి లేఆఫ్స్ భయాలు మొదలయ్యాయి.