Increase Salary: ప్రతి 3 నెలలకి జీతాల పెంపు, ప్రమోషన్స్..!
Increase salary: ఈ రోజుల్లో ఐటీ కంపెనీలకి పెద్ద సమస్య వచ్చిపడింది. ఉద్యోగులు తరచుగా ఉద్యోగాలని వదిలి వెళ్లిపోతున్నారు.
Increase salary: ఈ రోజుల్లో ఐటీ కంపెనీలకి పెద్ద సమస్య వచ్చిపడింది. ఉద్యోగులు తరచుగా ఉద్యోగాలని వదిలి వెళ్లిపోతున్నారు. చిన్న ఐటీ కంపెనీలే కాదు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పెద్ద ఐటీ కంపెనీలు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. దీని నుంచి బయటపడేందుకు విప్రో ఓ ప్రత్యేకమైన ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఉద్యోగులను ఒకే దగ్గర ఉంచడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి జీతాల పెంపు, ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్దమైంది.
విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు విప్రోలో ప్రతి ఉద్యోగికి మూడు నెలలకే ప్రమోషన్లు లభిస్తాయని జూలై నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి మూడు నెలలకోసారి ఉద్యోగుల జీతాన్ని పెంచబోతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ నుంచి ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు అందుబాటులోకి రానున్నాయి.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో విప్రో TCS,HCL టెక్ వంటి కంపెనీల కంటే ఎక్కువ నియామకాలు చేసింది. ఈ సమయంలో విప్రో ఉద్యోగుల సంఖ్య 15,446 పెరిగింది. ఈ కాలంలో కంపెనీని విడిచిపెట్టిన ఉద్యోగుల రేటు మార్చి త్రైమాసికంలో 23.8 శాతం నుంచి 23.3 శాతానికి తగ్గింది. విప్రో ఎగ్జిట్ రేటు వరుసగా మూడు త్రైమాసికాలుగా తగ్గుతోందని డెలాపోర్టే వివరించారు.