ఖాతాదారులకి శుభవార్త.. ఆర్బీఐ నిర్ణయంతో పెద్ద రాబడి..!

FD Interest: బ్యాంకులో ఎఫ్‌డి చేసేవారికి ఇది శుభవార్తనే చెప్పొచ్చు.

Update: 2022-10-12 06:11 GMT

ఖాతాదారులకి శుభవార్త.. ఆర్బీఐ నిర్ణయంతో పెద్ద రాబడి..!

FD Interest: బ్యాంకులో ఎఫ్‌డి చేసేవారికి ఇది శుభవార్తనే చెప్పొచ్చు. ఇప్పుడు కింది బ్యాంకులు ఎఫ్‌డిపై 7 శాతం వడ్డీ ప్రయోజనం అందిస్తున్నాయి. ఇందులో కెనరా బ్యాంక్‌, ఆర్‌బిఎల్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌ సహా పలు బ్యాంకులు ఉన్నాయి. RBI వరుసగా నాలుగోసారి రెపో రేటు పెంచడం వల్ల వివిధ బ్యాంకులు ఎఫ్‌డీ వడ్డీ రేట్లని పెంచుతున్నాయి. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత రుణం తీసుకోవడం చాలా ఖరీదుగా మారింది. కానీ వినియోగదారులు FDపై ఎక్కువ వడ్డీని పొందుతున్నారు. రెపో రేటు 5.90 శాతానికి పెరగగా బ్యాంకుల వడ్డీ రేటు కూడా 7 శాతం దాటింది.

కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ ఇటీవల రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డిలపై వడ్డీ రేటును పెంచింది. 666 రోజుల కాలవ్యవధితో ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం సాధారణ కస్టమర్లకు 7 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీని పొందుతారు.

బంధన్ బ్యాంక్

బంధన్ బ్యాంక్ 18 నెలల కంటే ఎక్కువ, 2 సంవత్సరాల కంటే తక్కువ FDలపై సాధారణ పౌరులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని ఇస్తోంది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు FDలపై సాధారణ కస్టమర్లు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లు 7.50 శాతం చొప్పున వడ్డీని పొందుతారు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు FDలపై సాధారణ కస్టమర్లకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీని ఇస్తోంది.

RBL బ్యాంక్

RBL బ్యాంక్ కస్టమర్లకు 7 శాతం వడ్డీ ప్రయోజనాన్ని అందిస్తోంది. 15 నెలల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై సాధారణ పౌరులకు 7 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.5 శాతం వడ్డీని ఇస్తోంది. ఇది కాకుండా 15 నెలల 1 రోజు నుంచి 725 రోజుల ఎఫ్‌డిలపై కస్టమర్‌లకు 7 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.5 శాతం వడ్డీ ప్రయోజనాన్ని ఇస్తోంది. 726 రోజుల నుంచి 24 నెలల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన FDలపై సాధారణ కస్టమర్లకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీని ఇస్తోంది. బ్యాంకు ఈ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి.

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ కస్టమర్ల ఎఫ్‌డిపై మంచి వడ్డీని ఇస్తోంది. ఈ బ్యాంకులు కస్టమర్లకు 7 శాతం వడ్డీ ప్రయోజనాన్ని ఇస్తున్నాయి. బ్యాంకు ఈ రేట్లు అక్టోబర్ 10 నుంచి అమలులోకి వచ్చాయి.

Tags:    

Similar News