SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకి శుభవార్త.. ఇక ఈ స్కీమ్‌లు మరింత అందుబాటులో..!
SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకి ఇది శుభవార్తని చెప్పాలి. తాజాగా మరో కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది.
SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకి ఇది శుభవార్తని చెప్పాలి. తాజాగా మరో కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇకనుంచి ఖాతాదారులు ఆధార్ నంబర్‌ని ఉపయోగించి వివిధ సామాజిక భద్రతా పథకాల కోసం నమోదు చేసుకోవచ్చు. పాస్‌బుక్ అవసరం లేదు. దీని గురించి ఆగస్టు 25న ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది మునుపటి కంటే మరింత సులువుగా జరుగుతుంది.
ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలు
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)
అటల్ పెన్షన్ యోజన (APY)
ఈ సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా మాట్లాడుతూ ఆర్థిక భద్రతకు ఎలాంటి అవరోధాలు ఉన్నా వాటిని తొలగించడమే మా లక్ష్యం. పాస్‌బుక్ అవసరాన్ని తగ్గించడం వల్ల సామాజిక భద్రతా పథకాల కవరేజీ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేశాం. ఈ పథకాల ప్రయోజనాలు అందరికి అందడానికి ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పేపర్ వర్క్ తగ్గించడం వల్ల వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది అలాగే సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు.
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) అనేది ఒక లైఫ్ ఇన్సూరెన్స్. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల ఖాతాదారులు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెబ్‌సైట్ ప్రకారం ఇది రూ.2 లక్షల ప్రత్యక్ష కవర్‌ను కలిగి ఉంది. వార్షిక ప్రీమియం రూ. 436 మాత్రమే. ఈ ప్రీమియం వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు బాధితులకి రూ.2 లక్షలు అందుతాయి.