SBI: ఎస్బీఐ ఖాతాదారులకి శుభవార్త.. వారికోసం కొత్త స్కీం ప్రారంభం..!

SBI: ఎస్బీఐ ఖాతాదారులకి శుభవార్త.. వారికోసం కొత్త స్కీం ప్రారంభం..!

Update: 2023-02-18 15:30 GMT

SBI: ఎస్బీఐ ఖాతాదారులకి శుభవార్త.. వారికోసం కొత్త స్కీం ప్రారంభం..!

SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవల SBI అమృత్ కలాష్ యోజనను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు ఆకర్షణీయమైన రాబడిని అందించే పరిమిత కాల ఫిక్సెడ్ డిపాజిట్ (FD) పథకం. ఈ పథకం కింద సాధారణ పౌరులకు 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ఇంకా అదనంగా బ్యాంక్ ఉద్యోగులు, పెన్షనర్లు 1 శాతం వడ్డీ ఎక్కువగా పొందవచ్చు.

ఎస్బీఐ అమృత్ కలాష్ పథకం వ్యవధి 400 రోజులు. పెట్టుబడిదారులు తమ డబ్బును ఫిబ్రవరి 15, 2023 నుంచి మార్చి 31, 2023 మధ్య డిపాజిట్ చేయవచ్చు. ఖాతాదారులు బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా లేదా ఎస్బీఐ యోనో యాప్‌ ద్వారా పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. 1 నుంచి 2 సంవత్సరాల కాలానికి డబ్బును పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ పథకం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు ఈ పథకం కింద అధిక వడ్డీరేట్లని పొందవచ్చు. ఎందుకంటే రూ.1 లక్ష పెట్టుబడిపై రూ.8,600 రాబడిని పొందుతారు. సాధారణ కస్టమర్లకు అదే మొత్తంపై రూ.8,017 వస్తాయి.

పెరిగిన ఆర్డీ వడ్డీ రేట్లు

ఎస్బీఐ తన FD, రికరింగ్ డిపాజిట్ (RD) పథకాల వడ్డీ రేట్లను కూడా పెంచింది. బ్యాంక్ ఇప్పుడు సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FDలకు 3.00 శాతం నుంచి 6.50 శాతం వరకు సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.

ఆర్‌డి పథకాల విషయంలో 12 నెలల నుంచి 10 సంవత్సరాల కాలానికి 6.80 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీ రేటు చెల్లిస్తోంది. అనేక ఇతర బ్యాంకులు తమ FD రేట్లను పెంచిన సమయంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అనేక చిన్న ఫైనాన్స్ బ్యాంకులు తమ FD పథకాలపై 9.00 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అందువల్ల ఎస్‌బిఐ వడ్డీ రేట్లను పెంచింది.

Tags:    

Similar News