NPS: ఎన్‌పీఎస్‌ ఖాతాదారులకి గుడ్‌న్యూస్.. పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త నిబంధనలు..!

NPS: మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెట్టినట్లయితే ఇది మీకు శుభవార్తని చెప్పవచ్చు.

Update: 2022-10-12 09:52 GMT

NPS: ఎన్‌పీఎస్‌ ఖాతాదారులకి గుడ్‌న్యూస్.. పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త నిబంధనలు..!

NPS: మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెట్టినట్లయితే ఇది మీకు శుభవార్తని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్‌పీఎస్‌ లాభాల గురించే కాదు నష్టాల గురించి కూడా సమాచారాన్ని పొందగలరు. ఇందుకోసం పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త నిబంధనను రూపొందించింది. వీటి ప్రకారం.. ప్రతి త్రైమాసికం ముగిసే 15 రోజులలోపు తమ వెబ్‌సైట్‌లలో అన్ని NPS పథకాల ప్రమాద సమాచారాన్ని అందించాలి.

ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ప్రకారం పెట్టుబడిదారులకు అవగాహన కల్పించేందుకు ఆరు ప్రమాద స్థాయిలను ఎంచుకుంది. NPS పథకాలలో పెట్టుబడి పెట్టేముందు ఈ ఆరు ప్రమాదాల నష్టాల గురించి సమాచారాన్ని అందించాలి. మొదటిది తక్కువ రిస్క్, రెండవది తక్కువ నుంచి మోడరేట్ రిస్క్, మూడవది మీడియం రిస్క్, నాల్గవది మీడియం-హై రిస్క్, ఐదవది హై రిస్క్, ఆరవది చాలా ఎక్కువ రిస్క్.

దీని ప్రకారం ప్రతి త్రైమాసికం ముగిసే ముందు 15 రోజులలోపు పెన్షన్ ఫండ్ వెబ్‌సైట్‌లోని 'పోర్ట్‌ఫోలియో డిస్‌క్లోజర్' విభాగంలో రిస్క్ స్థాయి సమాచారాన్ని అందించడం తప్పనిసరి. ఏదైనా మార్పు ఉంటే అది పెన్షన్ ఫండ్ వెబ్‌సైట్‌లతో పాటు NPS ట్రస్ట్ వెబ్‌సైట్‌లలో తెలియజేయాలి. పెన్షన్ ఫండ్స్ ప్రతి సంవత్సరం మార్చి 31 నాటికి వారి వెబ్‌సైట్‌లో పథకాల గురించి ప్రచురిస్తాయి.

Tags:    

Similar News