ఐసీఐసీఐ ఖాతాదారులకి గుడ్‌న్యూస్.. అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఏదైనా కొనేయొచ్చు..!
ICICI Customers: పండుగల సీజన్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి కొనాలని కోరుకుంటారు.
ICICI Customers: పండుగల సీజన్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి కొనాలని కోరుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో అన్ని షాపింగ్ వెబ్‌సైట్లు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకునేందుకు కస్టమర్లు షాపింగ్ చేస్తారు. కానీ చాలా మందికి అకౌంట్లో బ్యాలెన్స్ ఉండదు. ఈ పరిస్థితిలో ఫైనాన్స్ కోసం ఎదురుచూస్తారు. కానీ మీకు ఈ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా ఉంటే క్రెడిట్ కార్డ్ లేకుండా సులభంగా షాపింగ్ చేయవచ్చు. దీని కోసం మీరు ఖాతాలో డబ్బు ఉంచాల్సిన అవసరం లేదు.
ఐసీఐసీఐ బ్యాంకు
ICICI బ్యాంక్ అందించే ఈ సౌకర్యం పేరు EMI @ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇందులో ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్లు రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కొనుగోళ్లను డిజిటల్‌గా EMIలోకి మార్చుకోవచ్చు. ఈ సదుపాయం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉందని గమనించండి. దీనిద్వారా మీకు నచ్చిన గాడ్జెట్‌ను కొనుగోలు చేయవచ్చు. బీమా ప్రీమియం చెల్లించవచ్చు. పిల్లల పాఠశాల ఫీజులను చెల్లించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ ఖర్చును సులభమైన వాయిదాలలో చెల్లించవచ్చు. కస్టమర్ ఎంపిక ప్రకారం 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలల EMIలో ఖర్చులను చెల్లించవచ్చు.
ICICI బ్యాంక్ EMI సౌకర్యం కోసం BillDesk, Razorpay వంటి ప్రధాన ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే కంపెనీలతో జతకట్టింది. ప్రస్తుతం EMI @ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌లు, బీమా, ప్రయాణం, విద్య, పాఠశాల ఫీజులు, ఎలక్ట్రానిక్స్ చైన్‌లను కలిగి ఉన్న 1000 మంది వ్యాపారులు చురుకుగా ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని కేటగిరీలు యాడ్ చేస్తామని బ్యాంక్ చెబుతోంది.
మీరు యాప్ లేదా వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయాలనుకుంటున్న ఉత్పత్తిని ఎంచుకోండి. తర్వాత చెల్లింపు విషయానికి వస్తే మీరు ICICI బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ID, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. తక్షణమే EMIకి మార్చుపై క్లిక్ చేయాలి. ఎన్ని నెలల EMI పొందాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. OTPని ఎంటర్ చేయడం ద్వారా చెల్లించాలి.