EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకి శుభవార్త.. వడ్డీని పెంచిన కేంద్ర ప్రభుత్వం.. ఎంత పెంచిందంటే..?

EPFO: ఈపీఎఫ్‌వో (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్) సెంట్రల్ బోర్డ్ ట్రస్ట్ పీఎఫ్‌పై వడ్డీని పెంచింది.

Update: 2023-03-28 10:07 GMT

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకి శుభవార్త.. వడ్డీని పెంచిన కేంద్ర ప్రభుత్వం.. ఎంత పెంచిందంటే..?

EPFO: ఈపీఎఫ్‌వో (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్) సెంట్రల్ బోర్డ్ ట్రస్ట్ పీఎఫ్‌పై వడ్డీని పెంచింది. 8.10 శాతం నుంచి 8.15 శాతానికి పెంచింది. ఇది ఈపీఎఫ్ సభ్యులకు ఎంతో ఊరటనిస్తుంది. గత సంవత్సరం సీబీటీ ఈపీఎఫ్‌ రేట్లను 40 సంవత్సరాల కనిష్టానికి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సీబీటీ సమావేశం రెండు రోజులుగా జరుగుతోంది. పెంచిన వడ్డీ రేటు సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. ప్రభుత్వం ధృవీకరించిన తర్వాత మాత్రమే ఈపీఎఫ్‌వో వడ్డీ రేటును అందిస్తుంది.

ఒకసారి చారిత్రక డేటాను పరిశీలిస్తే 90వ దశకం ఈపీఎఫ్‌ వడ్డీ రేట్లు 10 శాతం కంటే ఎక్కువగా ఉండేవి. 1985-86 నుంచి రేట్లు 10 శాతానికి పైగా పెరిగాయి. 2000-01 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 12 శాతానికి పెరిగాయి. 2001-02 ఆర్థిక సంవత్సరం నుంచి EPF రేట్లు 10 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. గత దశాబ్దంలో ఈపీఎఫ్‌ రేట్లు 8.10% నుంచి 8.80% పరిధిలో ఉన్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఈపీఎఫ్‌ రేటు 8.80 శాతం, 2022 ఆర్థిక సంవత్సరంలో అత్యల్పంగా 8.10 శాతం ఉంది.

7 కోట్లకు పైగా సభ్యులు

ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓలో 7 కోట్ల మందికి పైగా సభ్యులున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈపీఎఫ్‌ఓ మొత్తం 14.86 లక్షల మంది సభ్యులను ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో చేర్చుకుంది. మొత్తంమీద సుమారు 7.77 లక్షల మంది కొత్త సభ్యులు మొదటిసారిగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చారు. ఈ నెలలో కేవలం 3.54 లక్షల మంది సభ్యులు మాత్రమే ఈపీఎఫ్‌వో నుంచి నిష్క్రమించారు. ఇది గత నాలుగు నెలల్లో అతి తక్కువ ఉపసంహరణ.

Tags:    

Similar News