RBI: ఖాతాదారులకి శుభవార్త.. ఇప్పుడు మరింత సులువుగా డబ్బులు విత్ డ్రా..!
RBI: మీరు ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.
RBI: మీరు ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. ఇప్పుడు మీరు ATM కార్డ్ లేకుండా డబ్బు విత్ డ్రా చేయవచ్చు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇప్పటి వరకు కొన్ని బ్యాంకుల్లో మాత్రమే ఈ సదుపాయం ఉంది. డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటును ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో కల్పిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. యూపీఐ ద్వారా ఏటీఎంల నుంచి సులువుగా డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు.
కార్డ్ క్లోన్ మోసాలు తగ్గుతాయి
RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకారం.. ఏటీఎం కార్డు లేకుండా డబ్బు తీసుకునే పద్దతి.. కార్డును క్లోనింగ్ చేయడం ద్వారా డబ్బు దొంగిలించే మోసాలని తగ్గిస్తుంది. అలాగే శక్తికాంత దాస్ ద్రవ్య విధానాన్ని ప్రకటించారు. ఎంపిసి పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. రెపో రేటు 4 శాతం వద్ద యథాతథంగా కొనసాగుతోంది. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను మార్చకపోవడం ఇది వరుసగా 11వ సారి. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ చివరిసారిగా రెపో రేటును 22 మే 2020న మార్చింది.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూనే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి సెంట్రల్ బ్యాంక్ తన మృదువైన వైఖరిని మార్చుకుంటుంది. రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ తక్షణ అవసరాలను తీర్చడానికి వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. రివర్స్ రెపో రేటు ప్రకారం వాణిజ్య బ్యాంకులు తమ డబ్బును రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంచడంపై వడ్డీని పొందుతాయి. MPC ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 7.2 శాతానికి తగ్గించింది.